Breaking
Loading...

Today's Quote

Today's Quote
LYRICS


అందాల తార
పల్లవి:    అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో
ఆది దేవుని జూడ - అశింపమనసు – పయనమైతిమి                             .. అందాల తార..
1.        విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను
వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున
విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్   .. అందాల తార..
2.        యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు
ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి
ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు      .. అందాల తార..
3.        ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను
ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన            .. అందాల తార..
 
అపరాధిని యేసయ్య
పల్లవి:    అపరాధిని యేసయ్య - క్రపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ క్రపలో - నపరాధములను క్షమించు ..అపరాధిని..
1.        సిలువకు నినునే గొట్టితీ - తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా ..అపరాధిని..
2.        ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితి వయ్యో       ..అపరాధిని..
3.        ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ             ..అపరాధిని..
4.        దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావినిడితి
ద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను      ..అపరాధిని..
5.        ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
క్క్రూరుండనై గొట్టితిని - ఘోరంపి పాపిని దేవా          ..అపరాధిని..
 
 
 
 
ఆడెదన్ పాడెదన్
పల్లవి:    ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో యేసుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో
ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో
1.        నను దర్శించి నూతన జీవం యిచ్చిన సన్నిధిలో
నను బలపరచి ఆదరించిన యేసుని సన్నిధిలో                             (2X)
ఆడెదన్, పాడెదన్ దేవుని సన్నిధిలో
స్తుతించెదన్ స్తుతించెదన్ ఆరధించెదన్ ఆరధించెదన్ దేవుని సన్నిధిలో
ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో
2.        పరిశుద్దాత్మజ్వాల రగిలించి నన్ను మండించిన సన్నిధిలో
పరిశుద్దాత్మలో నను అభిషేకించిన యేసుని సన్నిధిలో                     (2X)
ఆడెదన్, పాడెదన్ దేవుని సన్నిధిలో
స్తుతించెదన్ స్తుతించెదన్ ఆరధించెదన్ ఆరధించెదన్ దేవుని సన్నిధిలో
ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో యేసుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో
ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో
 
అత్యున్నత సింహాసనముపై
పల్లవి:    అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతుము నిన్నే
ఆహాహా ... హల్లేలూయ  (4X)
ఆహాహా ... హల్లేలూయ  (3X)  ...ఆమెన్
1.        ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం
…ఆహాహా…
2.        కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణకర్తా స్తోత్రం
…ఆహాహా…
3.        ఆమేన్ అనువాడా స్తోత్రం - ఆల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం
…ఆహాహా…
4.        మ్రుత్యుంజయుడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవా త్వరలో రానున్న - మేఘవాహనుడా స్తోత్రం
…ఆహాహా…
 
అన్ని నామముల కన్న
పల్లవి:     అన్ని నామముల కన్న పై నామము _ యేసుని  నామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)
1.            పాపముల నుండి విడిపించును _ యేసుని  నామము
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)
2.         సాతాను పై అధికార మిచ్చును _ శక్తి గల  యేసు నామము
శత్రు సమూహము పై జయమునిచ్చును _ జయశీలుడైన యేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)
3.         స్తుతి ఘన మహిమలు చెల్లించుచు _ క్రొత్త కీర్తన పాడెధము
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో _ స్తోత్ర గానము చేయుదము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)
అన్ని నామముల కన్న పై నామము _ యేసుని  నామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)



ఆరాధించెదను
పల్లవి:   ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య  - ఆత్మతో సత్యముతో                   (2X)
ఆనందగానముతో -  ఆర్భటనాదముతో                               (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య -  ఆత్మతో సత్యముతో                    (2X)
1.       నీ జీవవాక్యము నాలో -   జీవము కలిగించే                                             (2X)
జీవిత  కాలమంత,  నా యేసయ్య  -  నిన్నే కొలిచెదను                            (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య  -  ఆత్మతో సత్యముతో   (2X)
2.       చింతలెన్ని కలిగినను -  నిందలన్ని నన్ను చుట్టినా                                 (2X)
సంతోషముగ నేను,   నా యేసయ్య -  నిన్నే వెంబడింతును                    (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య  -  ఆత్మతో సత్యముతో                   (2X)
ఆనందగానముతో -  ఆర్భటనాదముతో                                                    (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య  - ఆత్మతో సత్యముతో                   (2X)
 
ఆలయంలో ప్రవేశించండి
పల్లవి:    ఆలయంలో ప్రవేశించండి అందరూ
స్వాగతం సుస్వాగతం యేసునామంలో
మీ బ్రతుకులో పాపమా కలతలా
మీ హృదయంలో బాధలా కన్నీరా
మీ కన్నీరంతా తిడిచి వేయు రాజు యేసు కోసం
1.        దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై
వెదకే వారికంతా కనబడు దీపము
యేసురాజు మాటలే వినుట ధన్యము
వినుట వలన విశ్వాసం అధికమధికము
ఆత్మలో దాహము తీరెను రారండి
ఆనందమనందం హల్లెలూయా                                ..ఆలయంలో..
2.        ప్రభు యేసు మాటలే పెదవిలోమాటలై
జీవ వృక్షంబుగా ఫలియించాలని
పెదవితో పలికెదం మంచి మాటలే
హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
నింపెదం నిండెదం కోరేదం పొందెదం
ఆనదంమానదం హల్లెలూయా                                 ..ఆలయంలో..
 
ఆశ్చర్యమైన ప్రేమ
పల్లవి:    ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది - నన్ను జయించె నీ ప్రేమ
1.        పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి, ఆదరించి, సేదదీర్చి, నిత్య జీవమిచ్చె              
…ఆశ్చర్యమైన ప్రేమ…
2.        పావన యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ 
నాకై మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి, తన మహిమ నిచ్చే       
…ఆశ్చర్యమైన ప్రేమ…
3.        శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని, ప్రేమది, ఎన్నడు, యెడబాయదు                       
…ఆశ్చర్యమైన ప్రేమ…
4.        నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి, కౌగలించి, ముద్దాడి, కన్నీటిని తుడిచే                
…ఆశ్చర్యమైన ప్రేమ…
 
ఆహా మహానందమే
పల్లవి:    ఆహా మహానందమే - ఇహ పరంబులన్ 
మహావతారుండౌ  - మా యేసు జన్మ దినం - హల్లేలూయ                .. ఆహా ..
1.        కన్యక గర్భమందు పుట్టగా - ధన్యుడవంచు దూతలందరు                   (2X)
మాన్యులౌ  పేద గొల్లలెందరో - అన్యులౌ  తూర్పు జ్ఞానులెందురో           (2X)   
నిన్నారాధించిరి - హల్లేలూయ                                                 .. ఆహా ..
2.        యెహోవా తనయా - యేసు ప్రభూ,  సహాయుడా - మా స్నేహితుడా     (2X)
ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ - మహానందముతో నిన్నారాధింతుము(2X)
నిన్నారాధింతుము - హల్లేలూయ                                             .. ఆహా ..
3.        సర్వేశ్వరున్ రెండవ రాకడన్ - స్వర్గంబు నుండి వచ్చు వేళలో              (2X)
సర్వామికా సంఘంబు భక్తితో - సంధించి నిన్ స్తోత్రిం చు వేళలో             (2X)
నిన్నారాధింతుము - హల్లేలూయ                                
 
ఇది కోతకు సమయం
పల్లవి:    ఇది కోతకు సమయం = పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా
పైరును చూచెదమా = పంటను కోయుదమా
1.        కోతెంతో విస్తారమాయెనే కోసెడి పనివారు కొదువాయెనే
ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే                      ..ఇది కోతకు..
2.        సంఘమా మౌనము దాల్చకుమా కోసెడి పనిలోన పాల్గొందుమా
యజమాని నిధులన్ని మీకేగదా                              ..ఇది కోతకు..
3.        శ్రమలేని ఫలితంబు మీకీయగా కోసెడి పనిలోన పాల్గొందుమా
జీవార్ధ ఫలములను భుజియింతమా                       ..ఇది కోతకు..



ఉదయ కాంతి రేఖలో
పల్లవి:     ఉదయ కాంతి రేఖలో - బెత్లెహేము పురమున 
అవతరించెను బాల యేసు - పాపాలు మోయు గొర్రె పిల్ల
పాపాలు మోయు గొర్రె పిల్ల 
1.        పరమ పుత్రుని మోహన రూపుగని - తల్లి మరియ మురిసే 
బాల యేసుని మహిమ రూపు -  ఈ జగానికి వెలుగై 
గొల్లలు జ్ఞానులు పరిశుద్దులు - ప్రస్తుతించిరి బాల యేసుని    .. ఉదయ..
2.        ఆకాశ తారల మెరుపు కాంతిలో - ప్రక్రుతి రాగాల స్వరాలతో 
హల్లెలూయ యని పాడుచు - దూత గణము స్తుతించిరి
జగ మొక ఊయలగా చేసి - దూతలు పాడిరి జోల పాట       .. ఉదయ.
 
ఉన్నతమైన ప్రేమ (Dm)
పల్లవి:    ఉన్నతమైన ప్రేమ - అత్యున్నతమైన ప్రేమ
శాశ్వతమైన ప్రేమ - పరిపూర్ణమైన ప్రేమ
యేసుని ప్రేమా - ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా
1.        నింగి నుండి నేలకు దిగివచ్చిన ప్రేమా
నేల నుండి నన్ను లేవనెత్తిన ప్రేమ                          (2X)
మంటి నుండి మహిమకు నను మార్చిన ప్రేమ              (2X)
ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా                      
… ఉన్నతమైన ప్రేమ …
2.        నీదు ప్రేమ నాకు జీవం - నా సమస్తమును
నీవు పొందిన శ్రమలన్నియును నాదుడెందములో           (2X)
నీవు కార్చిన రక్తమే నా -  ముక్తి మార్గమై                   (2X)
ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా                      
… ఉన్నతమైన ప్రేమ …
 
ఉన్నతమైన స్థలములలో (Cm)
పల్లవి:    ఉన్నతమైన స్థలములలో  - ఉన్నతుడా మా దేవా
ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా                  || ఉన్నత ||
1.       చెదరి పోయినది మా దర్శనము - మందగించినది ఆత్మలభారం
మరచిపోతిమి నీ తొలిపిలుపు - నీ స్వరముతో మము మేలుకొలుపు
నీ ముఖకాంతిని ప్రసరింపచేసి - నూతన దర్శన మీయుము దేవా
నీ సన్నిధిలో సాగిలపడగా - ఆత్మతో మము నిలుపుము దేవా        || ఉన్నత ||
2.        పరిశోధించుము మా హృదయములను - తెలిసికొనుము మా తలంపులను
ఆయాసకరమైన మార్గము మాలో - వున్నదేమో పరికించు చూడు
జీవపు ఊటలు మాలోన నింపి - సేదదీర్చి బ్రతికించు మమ్ము
మా అడుగులను నీ బండపైన - స్థిరపరచి బలపరచుము దేవా         || ఉన్నత ||
3.        మా జీవితములు నీ సన్నిధిలో - పానార్పణముగా ప్రోక్షించెదము
సజీవయాగ శరీరములతో - రూపాంతర నూతన మనసులతో
నీ ఆత్మకు లోబడి వెళ్ళెదము - నీ కృపచేత బలపడియెదము
లోకమున నీ వార్తను మేము - భారము తోడ ప్రకటించెదము          || ఉన్నత ||
 
ఊహల కందని లోకములో (Fm)
పల్లవి:    ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు        (2X)
ఉoటివిగా నిరంతరము ఉన్నతుడా  సర్వోన్నతుడా          (2X)
1.        సెరూబులు దూతాళి పరిశుద్దుడు పరిశుద్దుడని             (2X)
స్వరమెత్తి పరమందు పాటలు పాడేటి పావనుడా            (2X)
హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ     (2X)
… ఊహల …
2.        ఆల్ఫయను ఒమేగయను అన్నీ కాలంబుల నుండువాడా     (2X)
సర్వాధికారుండా సర్వేశ సజీవుండా                         (2X)
హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ     (2X)
… ఊహల …
 
ఎందుకో నన్నింతగ నీవు
పల్లవి:    ఎందుకో నన్నింతగ నీవు ప్రేమించితివో దేవా 
అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయ యేసయ్యా 
1.        నా పాపము బాప నరరూపి వైనావు - నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే            .. హల్లెలూయ..
2.        నీ రూపము నాలో నిర్మించి యున్నావు నీ పోలికలోనే నివసించు చున్నావు 
నీవు నన్ను ఎన్ను కొంటివి  నీ కొరకై నీ క్రుపలో                 .. హల్లెలూయ..
3.        నా శ్రమలు సహించి నా ఆశ్రయ మైనావు - నా వ్యధలు భరించి నన్నా దు కొన్నావు 
నన్ను నీలో చూచుకున్నావు నను దాచి యున్నావు         .. హల్లెలూయ..



ఎన్ని తలచినా
పల్లవి:     ఎన్ని తలచినా - ఏది  అడిగినా - జరిగేది నీ చిత్తమే 
ఎన్ని తలచినా - ఏది  అడిగినా - జరిగేది నీ చిత్తమే
 ప్రభువా  జరిగేది నీ చిత్తమే 
నీ వాక్కుకై - వేచి యుంటిని - నా ప్రార్ధన ఆలకించుమా 
ప్రభువా  -  నా ప్రార్ధన ఆలకించుమా 
1.        నీ తోడు లేక - నీ ప్రేమ లేక - ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు 
నీ తోడు లేక - నీ ప్రేమ లేక - ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు 
అడవి పూవులే - నీ ప్రేమ పొందగా - అడవి పూవులే - నీ ప్రేమ పొందగా
నా ప్రార్ధన ఆలకించుమా - ప్రభువా  నా ప్రార్ధన ఆలకించుమా  
2.        నా ఇంటి దీపం - నీవే అని తెలిసి - నా హృదయం నీ కొరకు పదిల పరచితి 
నా ఇంటి దీపం - నీవే అని తెలిసి - నా హృదయం నీ కొరకు పదిల పరచితి 
ఆరిపోయిన నా వెలుగు దీపము - ఆరిపోయిన నా వెలుగు దీపము 
వెలిగించుము నీ ప్రేమతో -  ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో
3.        ఆపదలు నన్ను - వెన్నంటియున్న - నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి 
ఆపదలు నన్ను - వెన్నంటియున్న - నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి 
లోకమంతయు నన్ను విడిచినా - లోకమంతయు నన్ను విడిచినా 
నీ నుండి వేరు చేయవు - ప్రభువా నీ నుండి వేరు చేయవు  
ఎన్ని తలచినా - ఏది  అడిగినా - జరిగేది నీ చిత్తమే
            ప్రభువా  జరిగేది నీ చిత్తమే
 
ఒకసారి ఆలోచించవా (Dm)
పల్లవి:    ఒకసారి ఆలోచించవా.. ఓ సోదరా
ఒకసారి అవలోకించవా.. ఓ సోదరీ                              (2X)   
నీ జీవిత మూలమేదో - నీ బ్రతుకు ఆధారమేదో              (2X)
… ఒకసారి…
1.  
    తండ్రి యెహోవా తన్ను పోలి - నిను చేసెను తన వూపిరిలో   (2X)
నా వలెనే నీవు పరిశుద్దముగ - జీవించమని కోరెను                      .
.         ..నీ జీవిత…
2.        దేవుని వదలి దుష్టుని కూడి - లోకము తట్టు మరలి         (2X)  
లోక మాయ సంకెళ్ళలో చిక్కి దురాశలలొ అణగారితివా               
...నీ జీవిత …
3.        లోకము వీడు యేసయ్యన్ చూడు - నిత్య జీవముకై పరుగిడు (2X)
నేనే మార్గము, సత్యము, జీవమని సెలవిచ్చెను మన మెస్సయ్యా   
...నీ జీవిత …
 
ఓ నీతి సూర్యుడా
పల్లవి:    ఓ నీతి సూర్యుడా -  క్రీస్తేసు నాథుడా
నీ దివ్య కాంతిని - నాలో వుదయింప జేయుమా ప్రభూ
నన్ను వెలిగించుమా                                                .. ఓ నీతి..
1.        నేనే లోకానికి - వెలుగై యున్నానని 
మీరు లోకానికి - వెలుగై యుండాలని 
ఆదేశమిచ్చినావుగావున - నాలో వుదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా                                                .. ఓ నీతి..
2.        నా జీవితమునే - తూకంబు వేసిన 
నీ నీతి త్రాసులో - సరితూగ బోనని 
నే నెరిగియింటిగావున - నాలో వుదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా                                                .. ఓ నీతి..
 
ఓ యేసు నీ దివ్య ప్రేమ
పల్లవి:    ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా
విలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ                        (2X)
1.        సిలువే శరణం ప్రతి జీవికి విలువే లేని మనుజాళికి                    (2X)
కలుషము బాపిన యేసయ్యకి
అలుపెరుగక ప్రార్ధన చేయుదము                                    || ఓ యేసు||
2.        తరతరములలో నీ నామము  వరముల నొసగిన పై నామను          (2X)
అరయగ అరుదెంచావయ్య
మొరలిడుదును మదిలో నేనయ్య                                    || ఓ యేసు||
 
ఓరన్న  ఓరన్న
పల్లవి:     ఓరన్న  ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _  చూడన్నా                                                  (2X)
1.            చరిత్రలోనికి వచ్చాడన్నా_ పవిత్ర జీవం తెచ్చాడన్నా                              (2X)
               
అద్వితీయుడు ఆదిదేవుడు _ ఆదరించెను ఆదుకొనును                        (2X)
ఓరన్న  ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _  చూడన్నా                                                 (2X)
2.         పరమును విడచి వచ్చాడన్నా_ నరులలో నరుడై పుట్టాడన్నా               (2X)
               
పరిశుద్దుడు పావనుడు _ ప్రేమించెను ప్రాణమిచ్చెను                              (2X)
ఓరన్న  ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _  చూడన్నా                                                 (2X)
3.         శిలువలో ప్రాణం పెట్టా డ న్నా _ మరణం గెలిచి లేచాడన్న                      (2X)
               
మహిమ ప్రభూ మృత్యంజయుడు _ క్షమియించును జయమిచ్చును    (2X)
ఓరన్న  ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _  చూడన్నా                                                 (2X)


కనుమా సిలువపై
పల్లవి:   కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు 
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు 
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను                          
1.       ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను                   
ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను       
ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను                   
ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను         
ఎవరైతే దేవుని నమ్మకుందురో వారు నశింతురు    (2X) 
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు 
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
2.       బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను                   
కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను                        
బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను                   
కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను
అలసి, సొలసి, నిస్సాహాయుడై తాను నిలిచెను     (2X)
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు 
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
మేకులతో కొట్టబడెను
మేకులతో కొట్టబడెను
 
కల్వరిగిరిలోన సిల్వలో 
పల్లవి:    కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు పలు బాధలొందెను
          ఘోరబాధలు పొందెను నీ కోసమే అది నా కోసమే            (2X)
1.        వధ చేయబడు గొర్రెవలె బదులేమీ పలుకలేదు
దూషించు వారిని చూచి దీవించి క్షమియించె చూడు         (2X) 
2.        సాతాను మరణమున్ గెల్చి పాతాళ మందు గూల్చి 
సజీవుడై లేచినాడు స్వర్గాన నిను చేర్చినాడు                (2X)
 
కలువరి గిరి సిలువలో
పల్లవి:   కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా      (2X)
విశ్వ మానవ శాంతి కోసం - ప్రాణ మిచ్చిన జీవమా          (2X)
యేసు దేవ నీదు త్యాగం - వివరింప తరమా                (2X)
కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా 
1.       కరుణ లేని, కఠిన లోకం - కక్షతో సిలువేసిన                (2X)
కరుణ చిందు మోము పైన - గేలితో ఉమ్మేసిన              (2X)
ముల్లతోను,  మకుటమల్లి - నీదు శిరమున నుంచిరా                          
నీదు శిరమున నుంచిరా                                            
కలువరిగిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా 
2.       జాలి లేని పాప లోకం - కలువ లేదు చేసిన                 (2X)
మరణ మందు సిలువలోన - రుదిరమేనిను ముంచిరా       (2X)
కలుష రహిత వ్యధను చెప్పి - అలసి సొలసి పోతివా
అలసి సొలసి పోతివా                                              
కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా      (2X)
విశ్వ మానవ శాంతి కోసం - ప్రాణ మిచ్చిన జీవమా          (2X)
యేసు దేవ నీదు త్యాగం  వివరింప తరమా                 (2X)
కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా 
 
క్రీస్తు జననము 
పల్లవి:     హల్లెలుయా అని పాడుచు క్రుపామయా నీకు స్తోత్రము 
పరిశుద్దుడు - ప్రేమ స్వరూపి 
ఈ జగానికి స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం
1.        దయా కిరాటము దరింప చేసి ధరణిలో వెలసితివి 
దీనులైన మాకు - నీ ప్రేమ నేర్పిటివి                  2X
నీ వెలుగు ప్రకాశింప - నీ కరుణ ప్రకాశింప - నీ సత్యము చాటింప 
నీ వెలుగును ప్రకాశింప                                 .. హల్లెలుయా..
2.        సంతసంబున నీ జననము మా బ్రతుకంత ధన్యమాయే 
చాటెను సువార్త జగతికి వేలిసేను ఆశా జ్యోతి        2X
ఈ దివిలో రాజు నీవే నా మదిలో శాంతి నీవే 
కుమ్మరించు నీదు ఆత్మ                               2X
.. హల్లెలుయా..


క్రీస్తు నేడు లేచెను
1.        క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ 
మర్త్య దూత సంఘమా ఆ ఆ ఆ హల్లెలూయ 
భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ 
బాడుమిందు చేతను ఆ ఆ ఆ హల్లెలూయ 
2.        మోక్షమియ్య నాథుడు ఆ ఆ ఆ హల్లెలూయ 
యుద్దమాడి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ 
సూర్యుడుద్బ వింపగ  ఆ ఆ ఆ హల్లెలూయ 
చీకటుల్ గతించెను ఆ ఆ ఆ హల్లెలూయ 
3.        బండ, ముద్ర, కావలి  ఆ ఆ ఆ హల్లెలూయ 
అన్ని వ్యర్ద మైనవి  ఆ ఆ ఆ హల్లెలూయ 
యేసు నరకంబును  ఆ ఆ ఆ హల్లెలూయ 
గెల్చి ముక్తి దెచ్చెను ఆ ఆ ఆ హల్లెలూయ 
4.        క్రీస్తు లేచినప్పుడు  ఆ ఆ ఆ హల్లెలూయ 
చావుముల్లు త్రుంచెను  ఆ ఆ ఆ హల్లెలూయ 
ఎల్ల వారి బ్రోచును  ఆ ఆ ఆ హల్లెలూయ 
మ్రుత్యువింక గెల్వదు  ఆ ఆ ఆ హల్లెలూయ 
 
గగనము చీల్చుకొని
పల్లవి:    గగనము చీల్చుకొని  యేసు  ఘనులను తీసుకొని 
వేలాది దూతలతో  భువికి  వేగమె రానుండె
1.       పరలోక పెద్దలతో పరివారముతో కదలి
ధర సంఘ వదువునకై తరలెను వరుడదిగో          … గగనము…
2.       మొదటను గొర్రెగను ముదమారగ వచ్చెను 
కొదమ సిం హపురీతి కదలెను గర్జనతో               … గగనము…
3.       కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు
ప్రథమమున లేచదరు పరిశుద్దులు మృతులు      … గగనము…
 
గీతం గీతం జయ జయ గీతం
పల్లవి:    గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి  పాడెదము ఆ ఆ 
యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
1.        చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను 
అందు వేసిన ముద్ర కావలినిల్చెను నా - దైవ సుతుని ముందు          || గీతం|| 
2.        వలదు వలదు యేడువవలదు - వెళ్ళుడి గలిలయకు 
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రకటించుడి             || గీతం||
3.        అన్న కయప వారల సభయు ఆదరుచు పరుగిడిరి
ఇంక భూతగణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి            || గీతం||
4.        గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి - జయ వీరుడు రాగా 
మీ వేళతాళ వాద్యముల్ - బూరలెత్తి ధ్వనించుడి                           || గీతం||
 
గెత్సేమనే తోటలో
పల్లవి:    గెత్సేమనే తోటలో - ప్రార్ధింప నేర్పితివా 
ఆ ప్రార్దనే మాకునిలా - రక్షణను కలిగించెను 
ఆ...ఆ...ఆ...ఆ...                                                  || గెత్సేమనే||
1.        నీ చిత్తమైతే ఈ గిన్నెను - నా యెద్ద నుండి తొలగించుమని 
దు:ఖంబులో భారంబుతో ప్రార్ధించితివా తండ్రి                     || గెత్సేమనే||
2.        ఆ ప్రార్దనే మాకు నిలా - నీ రక్షణ భాగ్యంబు కలిగించెను 
నీ సిలువే మాకు శరణం - నిన్న నేడు రేపు మాకు || గెత్సేమనే|| 
 
చిరకాల స్నేహితుడా
పల్లవి:    చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా                           (2X)  
నా తోడు  నీవయ్యా, నీ స్నేహం  చాలయ్యా
నా నీడ  నీవయ్యా,  ప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహం,  ఇధి నా యేసు  స్నేహం                                              (2X)
1.        బంధువులు వెలివేసిన, వెలివేయని  స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య  స్నేహం,  నాయేసుని  స్నేహం
చిరకాల స్నేహం,  ఇధి నా యేసు  స్నేహం                                              (2X)
2.        కష్టాలలో, కన్నీళ్లలో,  నను మోయు  నీ స్నేహం
నను ధైర్యపరచి  ఆదరణ కలిగించు, నాయేసుని  స్నేహం
చిరకాల స్నేహం,  ఇధి నా యేసు  స్నేహం                                              (2X)
3.        నిజమైనది, విడువనిధి,  ప్రేమించు నీ స్నేహం
కలువరిలొ చూపిన,  ఆ సిలువ స్నేహం,  నాయేసుని  స్నేహం
చిరకాల స్నేహం,  ఇధి నా యేసు  స్నేహం                                              (2X)
…చిరకాల స్నేహితుడా…


జయము క్రీస్తూ
పల్లవి:   జయము క్రీస్తూ -  జయ జయ లివిగో
భయము దీరె మరణముతో
జయము క్రీస్తూ -  జయ జయ లివిగో
భయము దీరె మరణముతో
సిలువ జయము మాకోసంబే
తులువ బ్రోవ విజయమహో   
సిలువ జయము మాకోసంబే
తులువ బ్రోవ విజయమహో   
జయము క్రీస్తూ -  జయ జయ లివిగో
భయము దీరె మరణముతో
1.       దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి
దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి
సాతానుని జాడ - సిలువలోనే దునుమాడ
జయగీతం రహిబాడ                                                 || జయము ||
2.       పాతాళము నొంచి - పరలోకము దెరచి
పాతాళము నొంచి - పరలోకము దెరచి
పాపాత్ముల కెంత - భాగ్యమెంచె క్షమియించె
పాడుదమా స్తుతియించి                                           || జయము ||
 
జయహే జయహే
పల్లవి:     జయహే జయహే జయహే జయహే - జయ జయ దేవ సుథ
జయ జయ విజయ సుథ - జయహే జయహే జయహే జయహే 
1.        సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను 
కలువరిలో నవ జీవన మొదవిను, జీవన మొదవిను
సిలువ పతాకకు జయమును గూర్చెను - సిలువ పతాకకు జయమును గూర్చెను
జయమని పాడెదను - నీ విజయము పాడెదను  .. నా  విజయము పాడెదను 
జయహే జయహే జయహే జయహే
2.        శోధనలలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను
వేదనలే తన భూమిగా మారెను, భూమిగా మారెను 
శోధన భాధలు బలమును గూల్చెను - శోధన భాధలు బలమును గూల్చెను 
జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా  విజయము పాడెదను 
జయహే జయహే జయహే జయహే
3.        స్వాన్తములో నిజ శాంతము లభించెను, శాంతి లభించెను
భ్రాంతులు వింతగా ప్రభు పర మాయెను,  ప్రభు పర మాయెను 
స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను - స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను 
జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా  విజయము పాడెదను 
జయహే జయహే జయహే జయహే - జయ జయ దేవ సుథ
జయ జయ విజయ సుథ - జయహే జయహే జయహే జయహే 
 
పల్లవి:     జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా       (2X)
1.        శరీరక్రియులన్నియు నాలో నశియించేయుమయు             (2X)
2.         బలహీన సమయుములో నీ బలము ప్రసాదించుము         (2X)
3.        ఆత్మీయవరములతో నన్ను అభిషేకం చేయుమయ            (2X)
4.        ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ           (2X)
 
తర తరాలలో
పల్లవి:    తర తరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో
దేవుడు ...దేవుడు ...యేసే దేవుడు ఆ ..ఆ .. ఆ ..
హల్లెలూయ ..హల్లెలూయ ..హల్లెలూయ ..
1.        భూమిని పుట్టింపక మునుపు - లోకము పునాది లేనపుడు  .. దేవుడు…
2.        సృష్టికి శిల్పాకారుడు - జగతికి ఆది సంభూతుడు                      .. దేవుడు…
3.        తండ్రి కుమార ఆత్మయు - ఒకటై యున్నా రూపము              .. దేవుడు…
 
దేవా నీకు స్తోత్రము
దేవా నీకు స్తోత్రము - యిచ్చావు నాకొక దినము
దేవా నీకు స్తోత్రము - యిచ్చావు నాకొక దినము
దీవించుము - నను ఈ దినము
దీవించుము - నను ఈదినము
జీవింతు నే నీకోసము
జీవింతు నే నీకోసము
ఆ ..ఆమెన్!  ఆ ..ఆమెన్!  ఆ ..ఆమెన్!
 
దేవుని వారసులం
పల్లవి:     దేవుని వారసులం - ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం - యేసుని దాసులము 
నవ యుగ సైనికులం - పరలోక పౌరులము 
హల్లెలూయ - నవ యుగ సైనికులం - పరలోక పౌరులము
1.        దారుణ హింస లలో - దేవుని దూతలుగా 
ఆరని జ్వాలలలో - ఆగని జయములతో 
మారని ప్రేమ సమర్పణతో  - సర్వత్ర యేసుని కీర్తింతుము
2.        పరిశుద్దాత్మునికై - ప్రార్థన సలుపుదము 
పరమాత్ముని రాక - బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై - సర్వాంగ హోమము జేయుదము 
3.        అనుదిన కూటములు - అందరి గృహములలో 
ఆనందముతోను - ఆరాధనలాయే 
వీనుల వినదగు పాటలతో - ధ్యానము చేయుచు మరియుదము

దైవం ప్రేమ స్వరూపం (F#)
పల్లవి:    దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం - శ్రీయేసుడే – అవనిలో  
దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం – శ్రీయేసుడే
ఆ .. ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం                
ఆ …. ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం         … దైవం…
1.        ఈ ధరలో ప్రేమ శూన్యం - ఆదరణలేని గమ్యం
ఈ ధరలో ప్రేమ శూ న్యం - ఆదరణలేని గమ్యం                    
మధురంపు యేసు ప్రేమ - మదినింపు మధుర శాంతి
మధురంపు యేసు ప్రేమా - మదినింపు మధుర శాంతి       … దైవం…
2.        కరుణించి క్రీస్తు నీకై - మరణించే సిలువ బలియై                     
కరుణించి క్రీస్తు నీ కై - మరణించే సిలువ బలియై
పరలోక దివ్య ప్రేమన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్
పరలోక దివ్య ప్రేమాన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్            … దైవం…
 
నన్నెంతగానో ప్రేమించెను
పల్లవి:     నన్నెంతగానో ప్రేమించెను  - నన్నెంతగానో కరుణించెను
            నా యేసుడు - నా పాపము - నా శాపము
            తొలగించెను - నన్ను కరుణించెను                    (2X) .. నన్నెంతగానో..
1.        సాతాను బంధాలలో - జీవంపు డంబాలలో          (2X)
                        పడనీయక - నన్ను చెడనీయక                       (2X)
                        తన క్రుపలో నిరతంబు నన్ను నిల్పెను  (2X) .. నన్నెంతగానో..
2.        సత్యంబు జీవంబును - ఈ బ్రతుకు సాఫల్యము     (2X)
            నేర్పించెను - నాకు చూపించెను                       (2X)
            వర్ణించగాలేను ఆ ప్రభువును                          (2X)  .. నన్నెంతగానో..
3.        కల్వరి గిరిపైనను - ఆ సిలువ మరణంబును         (2X)
            నా కోసమే -  తాను శ్రమ పొందెను                    (2X)
            నా పాపమంతటిని క్షమియిం చెను                   (2X)   .. నన్నెంతగానో..
4.        ఘనమైన ఆ ప్రేమకు - వెలలేని త్యాగంబుకు        (2X)
             ఏమిచ్చెదన్ -  నేనేమిచ్చెదన్                        (2X)
            నను నేను ఆ ప్రభుకు సమర్పింతును                (2X)   .. నన్నెంతగానో..
 
నా పేరే తెలియని ప్రజలు
పల్లవి:     నా పేరే తెలియని ప్రజలు - ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప -  కొందరే ఉన్నారు                             (2X)
ఎవరైనా - మీలో ఎవరైనా - వెళతారా - నా ప్రేమను చెబుతారా            (2X)
1.        రక్షణ పొందని ప్రజలు - లక్షల కొలది ఉన్నారు
మారుమూల గ్రామాల్లో - ఊరి లోపలి వీధుల్లో       (2X)               .. ఎవరైనా..
2.        నేను నమ్మిన వారిలో - కొందరు మోసం చేసారు   
వెళతామని చెప్పి - వెనుకకు తిరిగారు               (2X)               .. ఎవరైనా..
3.        వెళ్ళగలిగితే మీరు - తప్పక వెళ్ళండి 
వేల్లలేకపోతే - వెళ్ళేవారిని పంపండి                   (2X)               .. ఎవరైనా..
 
నా యేసు రాజుతో నేను సాగి పోదును 
పల్లవి:    నా యేసు రాజుతో నేను సాగి పోదును                                                 (2X)
సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను             (2X)
          సాతనును పార ద్రోలెదను - క్రీస్తులో జయించెదను                          (2X)
నే క్రీస్తులో జయించెదను - నే క్రీస్తులో జయించెదను
          అఅహా అఅహా హల్లెలూయ                                                              (3X)
          హల్లెలూయ హల్లెలూయ
1.        శత్రు సమూహము నను చుట్టినా - లోకము నన్ను నిందించినా         (2X)
           యెహోవ నిస్సీ నా ధ్వజము - నాకు తోడై జయ మిచ్చును             (2X)
           నాకు తోడై జయ మిచ్చును                         .. సాతనును పార ద్రోలెదను ..
2.        శోధన సంద్రము వలె పొంగినా - వ్యాధిబాధలు కృంగ  దీసినా             (2X)
           యెహోవ రాఫా నాకు స్వస్థత నిచ్చి నన్ను నడిపించును                 (2X)
 స్వస్థత నిచ్చి నడిపించును                          .. సాతనును పార ద్రోలెదను ..
3.        ధన సంపదలు నను విడచినా - బంధు మిత్రులు నను మరచినా        (2X)
           యెహోవ రోఫీ నా కాపరి - నన్ను కాచి నడిపించును                      (2X)
నన్ను కాచి నడిపించును                            .. సాతనును పార ద్రోలెదను ..
          నా యేసు రాజుతో నేను సాగి పోదును                                         (2X)
సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను             (2X)
          సాతనును పార ద్రోలెదను - క్రీస్తులో జయించెదను                          (2X)
క్రీస్తులో జయించెదను - నే క్రీస్తులో జయించెదను
          అఅహా అఅహా హల్లెలూయ                                                              (3X)
          హల్లెలూయ హల్లెలూయ
          హల్లెలూయ హల్లెలూయ


నిన్నే ప్రేమింతును
పల్లవి:    నిన్నే ప్రేమింతును,  నిన్నే ప్రేమింతును  -  యేసు
నిన్నే ప్రేమింతును,   నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
1.       నిన్నే పూజింతును,  నిన్నే పూజింతును -  యేసు
నిన్నే పూజింతును,  నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
2.        నిన్నే కీర్తింతును,  నిన్నే కీర్తింతును -  యేసు
నిన్నే కీర్తింతును,  నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ
3.        నిన్నే ప్రార్దింతును,  నిన్నే ప్రార్దింతును -  యేసు
నిన్నే ప్రార్దింతును,  నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
 
నిత్యుడైన దేవుని (E)
పల్లవి:    నిత్యుడైన దేవుని తోడు నీడ - నీపై ఉoడును
నిత్యము నిల్చును                                        (5X)
1.        ఎర్ర సముద్రమును - ఎడారి చేయువాడు                    (2X)
మారా జలములను - మాధుర్యముగ జేయును             (2X)
… నిత్యుడైన …
2.        ఫారో సైన్యములు - పరుషాలు పల్కినను                   (2X)
ప్రవాహ జలములలో - పడి చావజేసెను                     (2X)
… నిత్యుడైన …
3.        బలవంతుడైన దేవుడు - ఎల్ల కాలము బలమిచ్చును        (2X)
మార్గాన నడిపించును - మన్నాతో పోషించును              (2X)
… నిత్యుడైన …
 
నిలిచె నీ రేయీ
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో 
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో
(It Came Upon a Midnight Clear Music bit)
1.        ఆ తల్లి మరియ - నీ రూపుజూచి - లాలించె మొదమెంచె నెంతో            (Female)
ఆ బాలుడేసు - మా దేవుడంచు - చాటించిరి -ఈ భువిలో (Male)
(music bit)
ఆ తల్లి మరియ - నీ రూపుజూచి - లాలించె మొదమెంచె నెంతో            (Female)
ఆ బాలుడేసు - మా దేవుడంచు - చాటించిరీ భువిలో (Male)
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
వెచ్చనీ  కాంతిలోన వెల్గే నీ లోకమా రారాజువై నిలిచిపో ఈ భువిలో      (Female)
          నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో 
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో
(It Came Upon a Midnight Clear Music bit)
2.        ఆ తూర్పు తార - మార్గంబుజూపెన్ - పయనించిరి జ్ఞాన త్రయము        (Female)
పాపులకు రక్షణ - కలుగునని నమ్మి - ప్రకటించిరీ సువార్త                 (Male)
(music bit)
ఆ తూర్పు తార - మార్గంబుజూపెన్ - పయనించిరి జ్ఞాన త్రయము        (Female)
పాపులకు రక్షణ - కలుగునని నమ్మి - ప్రకటించిరీ సువార్త                 (Male)
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
వెచ్చనీ  కాంతిలోన వెల్గే నీ లోకమా రారాజువై నిలిచిపో ఈ భువిలో      (Female)
          నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో 
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో
నిలిచిపో - ఈ భువిలో
నిలిచిపో - ఈ భువిలో
 
3.        దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకై ఆకలి నీకుందా     (2X)
యేసు నాథునితో సహవాసం నీకుందా                           .. రాకడ..
 
నీటి యూట యొద్ద నాట బడితిమి
పల్లవి:    నీటి యూట యొద్ద నాట బడితిమి - వేరుతన్ని ఎదిగి ఫలియింతుము
చింత పడము మాకాపుమానము -  యేసు కృప చాలును  .. నీటి..
1.        పాపం పోయెను హల్లెలూయ -  యేసు లేచెను హల్లెలూయ 
యేసు వచ్చెను హల్లెలూయ -  స్తుతి గీతం పాడుదము     .. నీటి..
2.        యేసే మార్గము హల్లెలూయ -  యేసే సత్యము హల్లెలూయ 
యేసే జీవము హల్లెలూయ -  యేసు వార్తను చాటుదము   .. నీటి..
3.        వాక్య ధ్యానము హల్లెలూయ -  ప్రార్థనాత్మతో హల్లెలూయ 
ఏకత్వముతో హల్లెలూయ -  సహవాసం కోరుదమా         .. నీటి.. 

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు (Dm)
పల్లవి:    నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది                      (2X)
నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్త్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా                (2X)
1.        పనికిరాని నను నీవు పైకి లేపితివి
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి                    (2X)
నా అడుగులు స్థిర పరచి బలము నిచ్చితివి
నీదు అడుగు జాడలనే వెంబడింతు  ప్రభు
ఇలలో వెంబడింతు  ప్రభూ                                     
…నా ప్రాణమా…
2.        ఆంధకారపు లోయలలో నేను నడిచినను
ఏ అపాయము రాకుండ నన్ను నడిపితివి                   (2X)
కంటిపాపగ  నీవని నిన్ను కొలిచితివి
కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను
ఇలలో నిన్ను కొలిచెదను                                 
…నా ప్రాణమా…
 
నీవు నిర్మించిన దేవాలయములో (F)
పల్లవి:    నీవు నిర్మించిన దేవాలయములో నీతో జత పనివారము
నీ ప్రత్యక్షతగల పరిశుద్దాలయంలో నిన్ను మహిమ పరచెదము (2X)
హల్లెలూయ హల్లెలూయ  హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ  హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ  హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ  హల్లెలూయ
మహిమా ప్రభావములు నీకే చెల్లున్
1.       నిరంతరము నియమముతో నిండు హృదయ కృతజ్ఞతతో      (2X)
నీరీక్షణతో స్తోత్రములతోను నిత్యుండగు దేవా రాదింతుము    (2X)
… హల్లెలూయ…
2.        నీ సంఘమూ ఈబండపైన నిలువనిమ్ము క్రీస్తు ప్రభూ      (2X)
నీ వాక్యముతో మమ్ము నింపుము నీతి మార్గములో నడుపుము దేవా(2X)
… హల్లెలూయ…
3.        నిర్దోషమైన నిర్మలమైన నీ రక్తముతో మమ్ము పొందితివి      (2X)
నీవే ప్రభువా తరతరములాకు నీవాస స్థలముగా ఉన్నావు  (2X)
… హల్లెలూయ…
 
నీ స్వరము వినిపించు ప్రభువా
పల్లవి:    నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ 
నీ వాక్యమును నేర్పించు దానియందు నడచునట్లు నీతో               .. నీ..
1.        ఉదయముననే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము 
దినమంతటి కొరకు నను సిద్దపరచు రక్షించు ఆపదల నుండి           .. నీ..
2.        నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు సరి జేసుకొందు 
నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు               .. నీ..
3.        భయ భీతులతో తుఫానులలో నీ స్వరము వినిపించుము 
అభయము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను              .. నీ..
4.        నాతో మాట్లాడు స్పస్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే 
నీతో మనుష్యులతో సరిజేసుకొందు నీ దివ్య వాక్యము ద్వారా           .. నీ..
 
నీలాకాశంలోన
పల్లవి:    నీలాకాశంలోన నింగికెగసె తార                             (2x)
ఆ తార వెలుగు గమనం బాల యేసు జననం               (2x)
ఆనందం ఆనందం అరుణోదయానందం                    
నా హ్రుధిలో నా మదిలో అరుణోదయానందం 
1.        ప్రవచనము నెరవేరిన రోజు కన్నియగర్భాన మెరిసిన కాంతుల్  (2x)
సంతోష సంబ్రాలు నిండిన రోజు హృదయ కాంతితో స్తంభించిన రోజు               ||నీలాకాశంలోన||
మహోన్నత మైన స్థలములలో దేవునికి మహిమ దేవునికి మహిమ  
2.        గొల్లలు జ్ఞానులు సంభ్రముతో తపియించిరి వరపుత్రుని బోసి నవ్వులన్ (2x)
నీ క్రుపాసనంబు నొద్ద దు:ఖము తీర ఆదరించుమా ప్రేమ సాగరా                ||నీలాకాశంలోన||
 
నీ శిలువలోనే నా  ముక్తీ
పల్లవి:     నీ శిలువలోనే నా  ముక్తీ  - నీ నీడలోనే నా జీవితం  
నీ శిలువలోనే నా  ముక్తీ - నీ నీడలోనే నా జీవితం -  నీ శిలువలోనే
1.        నా కనుపాపగా నీవున్నావని - నా మదిలోని మమతవు నీవని 
నీ రక్తముతో నను కొన్నావని నీ రక్తముతో నను కొన్నావని 
నిరతం కొలుతును ఇల నిను దేవా 
నిరతం కొలుతును ఇల నిను దేవా నీ శిలువలోనే 
2.        సర్వ లోకాల పాపాలు మోయ - స్వామీ నీవే బలి అయితివే 
సమర్పింతు తండ్రి నా హృదయమును -  సమర్పింతు తండ్రి నా హృదయమును 
సంపూర్ణ శాంతి  నాకిమ్ము దేవా - సంపూర్ణ శాంతి  నాకిమ్ము దేవా 
నీ శిలువలోనే నా  ముక్తీ  - నీ నీడలోనే నా జీవితం  
నీ శిలువలోనే నా  ముక్తీ - నీ నీడలోనే నా జీవితం -  నీ శిలువలోనే 


నీవుంటే నాకు చాలు యేసయ్య
పల్లవి:     నీవుంటే  నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా
            నీవుంటే  నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా
నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా 
నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా 
నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా 
నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా 
నీవుంటే  నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా
నీవుంటే  నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా
1.        ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను 
ఎంత కష్టమొచ్చిన - నిష్టూర మైనను                
ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను 
ఎంత కష్టమొచ్చిన - నిష్టూర మైనను                 .. నీ మాట..
2.        బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను 
అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన          
బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను 
అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన           .. నీ మాట..
3.        ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా 
ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా            
ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా 
ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా .. నీ మాట..
4.        నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము 
నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము      
నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము 
నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము       .. నీ మాట..
 
నే పాపినో ప్రభువా
పల్లవి:    నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా 
నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా                              (2X)
1.        కరుణాలవాలా - నీ మ్రోల నేలా - తల వాల్చి నిలిచేనులే           (2X)
దయ చూడు చాలా - దురితాల ద్రోలా - నీ సాటి దైవంబు లేరవ్వరు
లేరవ్వరు                                                             || నే పాపినో ||
2.        వుదయించినావు - సదయుండ నీవు - ముదమార మా కొరకై   (2X)
మోసీవు సిలువ - నీ ప్రేమ విలువ నా తరమా చెల్లించ - నా యేసువా
నా యేసువా                                                                            || నే పాపినో ||
 
పరమ జీవము
1.        పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతో నుండ 
నిరంతరము నన్ను నడిపించును - మరల వచ్చి యేసు కొని పోవును 
పల్లవి:     యేసు చాలును - యేసు చాలును 
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును 
2.        సాతాను శోధనలధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్ళదను 
లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళదను        .. యేసు..
3.        పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలము చెంత నడిపించును 
అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణ లోయలో నన్ను కాపాడును 
4.        నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము కుళ్ళి కృశించినను 
హరిన్చినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడచినను    .. యేసు.
 
పరమ పావనుడు
పల్లవి:    పరమ పావనుడు మరియ తనయుడు అవతరించెనే శుభ దినాన (2x)
మది పరవశాన ఉప్పోంగగ పరవశాన ఉప్పోంగగ
అందించెదను ప్రేమ సందేశం అందించెదను క్రిస్మస్ సందేశం  ||పరమ|| 
1.        దూత గణములెల్ల మదినాలపింపగా గొల్లలు స్తుతులను అర్పింపగ  (2x)
వినరండి బాల యేసుని దివ్యగాథను 
కనరండి దైవ తనయుని ఇమ్మానుయేలును                ||పరమ||
2.        తారలు కాంతులు జగమంత వెదజల్లగ జ్ఞానులు కానుకలర్పింపగ (2x)
అర్పించెదను నా జీవితం రక్షణ మార్గం వెదజల్లగ            ||పరమ||
 
ప్రభువా నీ కార్యములు (Ab)
పల్లవి:    ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి
దేవా నీదు క్రియలు అద్బుతములై యున్నవి               (2X)
నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా    (2X)
1.        హాలేలూయ హాలేలూయ  
భరియింపరాని  దు:ఖములు  యిహమందు నను చుట్టిన
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి              (2X)
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా యిలలో జీవింతును
సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా    (2X)
2.        హాలేలూయ హాలేలూయ
లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి             (2X)
నిర్దోషిగ చేయుటకై నీవు ధోషివైనావు
నీదు సాక్షిగా యిలలో జీవింతును
సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా    (2X)
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి
దేవా నీదు క్రియలు అద్బుతములై యున్నవి               (2X)   
నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా   (2X) 


పరిశుద్ధ పరిశుద్ధ
పల్లవి:     పరిశుద్ధ పరిశుద్ధ = పరిశుద్ధ ప్రభువా =
వరదూతలైన నిన్ = వర్ణింప గలరా                          ..పరిశుద్ధ..
1.        పరిశుద్ధ జనకుడ = పరమాత్మ రూపుడ =
నిరుపమ బలబుద్ధి = నీతి ప్రభావా                          ..పరిశుద్ధ..
2.        పరిశుద్ధ తనయుడ = నరరూపధారుడ =
నరులను రక్షించు = కరుణా నముద్రా                     ..పరిశుద్ధ..
3.        పరిశుద్ధ మగు నాత్మ = వరము లిడు నాత్మ =
పరమానంద ప్రేమ = భక్తుల కిడుమా                      ..పరిశుద్ధ..
4.        జనకకుమారాత్మ = లను నేక దేవ =
ఘనమహిమచెల్లును = దనర నిత్యముగా              ..పరిశుద్ధ..
 
పాడెదము వేడెదము (Cm)
పల్లవి:    పాడెదము వేడెదము యేసు నామము
వేడెదము కొనియాడెదము క్రీస్తు నామము
1.        ఈ లోక మందునా అంథకార మందునా  (2X)
దేవా నీవే నాకు దివ్యమైన జ్యోతివి
..పాడెదము ..
2.       శ్రమలెన్ని వచ్చినా బాధలెన్ని చుట్టినా   (2X)
దేవా నీవే నాకు ఆశ్రయము దుర్గము
..పాడెదము ..
3.       ఈ లోక ఆశలన్ విడనాడే మనస్సును    (2X)
దేవా నీవే నాకు దయ చేయుమూ దినదినం
..పాడెదము ..
 
ప్రార్ధన వినెడి పావనుడా
పల్లవి:     ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా                     ..ప్రార్ధన..
1.        శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్యబృందముకు నేర్పితివి
పరముడ నిన్ను – ప్రణుతించెదము – పరలోక ప్రార్ధన నేర్పుమయా     ..ప్రార్ధన..
2.        పరమ దేవుడవని తెలిసి - కరము లెత్తి జంటగ మోడ్చి = శిరమును
వంచి సరిగమ వేడిన - సుంకరి ప్రార్ధన నేర్పుమయా                        ..ప్రార్ధన..
3.        దినదినంబు చేసిన సేవ - దైవ చిత్తముకు సరిపోవ = దీనుడవయ్యు
దిటముగ కొండను - చేసిన ప్రార్ధన నేర్పుమయా                            ..ప్రార్ధన..
4.        శత్రుమూక నిను చుట్టుకొని - సిలువపై నిను జంపగను
శాంతముతో నీ - శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన నేర్పుమయా           ..ప్రార్ధన..
 
భాసిల్లెను శిలువలో
పల్లవి:     భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా  
భాసిల్లెను శిలువలో పాపక్షమా 
1.        కలువరిలో నా పాపము పొంచి - శిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహర కరుణించితివి - కలుషహర  హరుణించితివి
భాసిల్లెను శిలువలో పాపక్షమా
2.        నమ్మిన వారిని కాదని వనియు - నెమ్మది నొసగెడి నా ప్రభుడవని 
నమ్మితి నీ పాదంబులను - నమ్మితి నీ పాదంబులను
భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ  నీ దివ్య క్షమా  
భాసిల్లెను శిలువలో పాపక్షమా
 
మహోదయం శుభోదయం
పల్లవి:    మహోదయం  శుభోదయం  సర్వలోకాని కరుణోదయం
శ్రీయేసు రాజు జన్మ దినం  భూప్రజలెల్లరి హృదయానందం 
1.        సర్వలోకాన సువార్త తెల్ప భువికేతించిన మరియ పుత్రుడు 
క్రుపామయుడు సత్య సంపూర్ణుడు  క్రీస్తేసు రాజు జన్మ దినం 
ఆ హల్లేలుయా  ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా  ఆ హల్లేలుయా (2x)
2.        ఘోర పాపములోనున్న జనులకు పరలోక జీవ మార్గము చూప 
కరుణామయుడు ఇమ్మానుయేలు అవతరించిన శుభోదయం 
ఆ హల్లేలుయా  ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా  ఆ హల్లేలుయా (2x)
మరణము గెలిచెను మన ప్రభువు
పల్లవి
:   మరణము గెలిచెను మన ప్రభువు – మనుజాళి రక్షణ కోస
మూ        (2X)
        
ఎంత ప్రేమ, ఎంత త్యాగం, జయించె సమాధినీ                        (2X)
          మరణము గెలిచెను మన ప్రభువు - మనుజాళి రక్షణ కోసమూ
1.       పాపపు ఆత్మల రక్షణకై - గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై               (2X)
         
నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు                                     (2X)
         
ఎంత జాలి, ఎంత కరుణ యికను మన పైన                          (2X)
          మరణము గెలిచెను మన ప్రభువు - మనుజాళి రక్షణ కోసమూ        (2X)            
2.       నేడే పునరుద్దాన దినం - సర్వ మానవాళికి పర్వ దినం                (2X)
         
పాపపు చెర నుండి విడుదల                                        (2X)
         
ఎంత ధన్యం, ఎంత భాగ్యం - నేడే రక్షణ దినం                         (2X)            
         
మరణము గెలిచెను మన ప్రభువు - మనుజాళి రక్షణ కోసమూ        (2X)
 
మంచి సాక్షిగ మార్చుము
పల్లవి:     మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా 
            మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా 
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా
1.        నాపై కనపరిచిన నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవం
నాపై కనపరిచిన నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవం
నలిగిన ప్రతి హృదయానికి - ప్రకటింప సెలవియ్యవా 
నలిగిన ప్రతి హృదయానికి - ప్రకటింప సెలవియ్యవా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా 
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా
2.        నా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి వాసునిగా
నా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి వాసునిగా
నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా                    
నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా 
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
 
మంచి సాక్షిగ మార్చుము
పల్లవి:     మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా (2X)
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా                                  (2X) 
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా
1.        నాపై కనపరిచి నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవం              (2X)
నలిగిన ప్రతి హృదయానికి - ప్రకటింప సెలవియ్యవా            (2X) . యేసయ్య..
2.        నా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి దాసునిగా           (2X)
నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా  (2X)          ..యేసయ్య..
 
మందలో చేరని గొర్రెలెన్నో
పల్లవి:     మందలో చేరని గొర్రెలెన్నో- కోట్ల కొలదిగా కలవు యిల
ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంఘమా
రమ్మనే యేసు ప్రార్ధించుము - నడిపించును
1.        అడవులలో పలు స్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్
వారి నిమిత్తమై శ్రమ పడితి - మరి వారిని వెదకెడు వారెవరు
2.        అడవులలో పలు స్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్
వారి నిమిత్తమై శ్రమ పడితి - మరి వారిని వెదకెడు వారెవరు
3.        నాకై పలికెడి నాలుకలు - నావలె నడిచెడి పాదములు
నన్ను ప్రేమించెడి హృదయములు - నాకు కావలె నీ విచ్చెదవా

యెహోవ నా కాపరి (Fm)
పల్లవి:    యెహోవ నా కాపరి .. యెహోవ నా ఊపిరి, నాకు లేమి,  ఏమి
లోయలలో .. లోతులలో  యెహోవ నా కాపరి
సంద్రములో .. సమరములో యెహోవ నా కాపరి            (2X)
1.        పచ్చిక గల చోట్ల .. నన్ను పరుండ జేయును                (2X)
శాంతి కరమైన జలములకు .. నన్ను నడిపించును          (2X)
…  లోయలలో …
2.        గాడాంధకారపు లోయలలో -- సంచరించినను               (2X)
అపాయమే కలుగదు నాకు .. నీ తోడు నా కుండగ           (2X)
…  లోయలలో …
3.        చిర కాలము నేను .. యెహోవ సన్నిధిలో                  (2X)
నివాసముండెదను నేను -- నిత్యము జీవింతును  (2X)
…  లోయలలో …
 
యెహోవా నీ నామము
పల్లవి:    యెహోవా నీ నామము - ఎంతో బలమైనది  ...ఆ...ఆ...ఆ...
యేసయ్య నీ నామము - ఎంతో ఘనమైనది ...ఆ...ఆ...ఆ...|| యెహోవా ||
1.        మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి          || యెహోవా ||
2.        నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా 
అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి                 || యెహోవా ||
3.        సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి 
ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము                     || యెహోవా ||
4.        చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా 
సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను              || యెహోవా ||
 
యేసు రక్తము రక్తము  రక్తము
పల్లవి:    యేసు రక్తము రక్తము  రక్తము - యేసు రక్తము రక్తము రక్తము 
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము  
యేసు రక్తము రక్తము రక్తము 
యేసు రక్తము రక్తము రక్తము
1.        ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము          
          ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము
బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే  
బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే
యేసు రక్తము రక్తము రక్తము  యేసు రక్తము రక్తము రక్తము 
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము  
యేసు రక్తము రక్తము రక్తము 
2.        మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము     
          మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను       
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను
యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము 
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము  
యేసు రక్తము రక్తము రక్తము 
3.        మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము       
మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను 
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను  
యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము 
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము  
యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము 
 
యెహోవా దయాళుడు
పల్లవి:     యెహోవా దయాళుడు
ఆయనకే కృతజ్ఞత - స్తుతి చెల్లించుడి 
కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి 
1.        నాకము వర్షించినా - లోకము నశించినా 
మీకు అండగా - నిలిచిన విభునకు 
కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి 
2.        కరువులు కలిగినను - మరణము వచ్చినను 
కరుణతో కొరతలను - తీర్చిన ప్రభునకు 
కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి
3.        ఆపదలే రానీ - అపనిందలే గానీ 
కాపరియై మిమ్ము - గాంచిన క్రీస్తుకు 
కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి
 
 
యేసు నీ క్రుపలో
పల్లవి:   యేసు నీ క్రుపలో మము కాపాడుము దేవా
మమ్ము రక్షించి నిత్య రాజ్యములో
నడుపము మా ప్రభువా - నడుపుము మా ప్రభువా ...యేసు ...
1.       కృంగిన వేళలలో - అలసిన సమయములో
నా చేయి విడువకను - నన్ను నిలబెట్టు
నన్ను నీ ఆత్మతో పూర్ణముగా చేసి
నిలుపుము జ్యోతివలె - నిలుపుము జ్యోతివలె      ...యేసు ..
2.       సిలువను మోసికొని - సువార్త చాటింప
విలువగు నీ శక్తిచే - నిత్యము నడిపించు
యేసు నీ రాకడలో - నిన్ను ఎదుర్కొనుటకు
నీ కృప నీయుమయా - నీ కృప నీయుమయా       ...యేసు ..
 
యేసు రక్తము రక్తము  రక్తము
పల్లవి:    యేసు రక్తము రక్తము  రక్తము - యేసు రక్తము రక్తము రక్తము 
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము                     
…యేసు…
1.        ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము           (2X)
బహు దుఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే              (2X)   
…యేసు…
2.        మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము               (2X)
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను                 (2X)   
…యేసు…
3.        మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము        (2X)
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను            (2X)   
…యేసు…
 
రండహో వినరండహో(Bbm)
పల్లవి:    రండహో వినరండహో శుభ వార్త ఒకటి వినిపించెదం 
సంతోషముతో దరి చేరండి సంభ్రాలతో యిక స్తుతి కలపండి  (2X)
.. రండహో
1.        అలనాడు బెత్లేహేము పశుల పాకలో
కన్నియ మరియకు శిశువు పుట్టెను                       (2X)
గొల్లలు జ్ఞానులు కానుకలతో స్తుతులర్పించిరి                (2X) ||రండహో||
2.        ప్రవచనమునుబట్టి అభిషక్తుడవతరించె
భూరాజులకదిఎంతో భీతి కలిగించెన్                         (2X)
అంతము చేయ దలచినంత దూత గణం రక్షించెన్  (2X)
సంభ్రాలతో యిక శృతి కలపండి                             ||రండహో||
3.        నాటి నుండి నేటి వరకు కృపతో తోడుండి 
పరమందు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నా                  (2X)
యేసుని జన్మ శుభాశిస్సులందు కొనరండి                  (2X)
సంభ్రాలతో యిక శృతికలపండి                              ||రండహో||        

  CLICK HERE FOR MORE..

0 comments:

Post a Comment

 
Copyright © 2014. JESUS | Distributed By My Blogger Themes | Designed By OddThemes