Breaking
Loading...

Today's Quote

Today's Quote
Showing posts with label Telugu Stories. Show all posts
Showing posts with label Telugu Stories. Show all posts

ఎస్తేరు గ్రంథం

 

అధ్యాయాలు : 10, వచనములు : 167
గ్రంథకర్త : మొర్దెకైగా (9:29) (రచనా శైలిని తీసికొని ఈ పుస్తకమును ఎజ్రాయో, నెహెమ్యాయో వ్రాసి యుండవచ్చు) 
రచించిన తేది : దాదాపు 133 సం. క్రీ.పూ
మూల వాక్యాలు : 4:14 “నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కునుండి వచ్చును గాని, నీవును నీ తండ్రి యింటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను”.
రచించిన ఉద్ధేశం: దేవుని సార్వభౌమాధికారాన్ని తెలియజేసి తన ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, సంరక్షణ ఎంత గొప్పదో, మహా మేధావులను సహితం తన స్వాధీనంలో ఉంచుకొని ఎలాంటి పరిస్థితుల్లోనైనా అవలీలగా మార్చగల దేవుని శక్తి సామర్ధ్యాలను లోకానికి ప్రత్యక్షం చేయడమే ఈ గ్రంథం ముఖ్య ఉద్దేశం. ఈ పుస్తకంలో ఎక్కడ కూడా దేవుడు, ధర్మశాస్త్రము, యెరుషలేము, ప్రార్థన అనే మాటలు కనిపించవు. కాని ప్రతీ సందర్భంలో పరోక్షంగా దేవుని హస్తం, దేవుని ప్రేమ, దేవుని బిడ్డల ప్రార్ధన, దేవుని కాపుదల కనిపిస్తాయి. ప్రత్యేకంగా మన దేశం పేరు ఈ గ్రంధంలోనే హిందూ దేశము అని ప్రాయబడడం విశేషం.
ఉపోద్ఘాతం: స్త్రీల పేర్లలో కనబడు గ్రంథములలో ఇది ఒకటి. ఆదిమ హెబ్రీ బాషలో ఎస్తేర్తు గ్రంథం “మెగిల్లాహ్” అని ప్రాముఖ్యముగా యూదుల పూరీము పండుగ వేడుకల్లో పర్ణశాలలో బిగ్గరగా చదువబడిన గ్రంథం. ప్రపంచ చరిత్రను, తన ప్రజలైన ఇశ్రాయేలీయులను తన హస్తాల్లో ఉంచుకొన్న దేవుడు, కొంత మంది వ్యక్తులను మరుగున ఉంచి, తన స్వంత సమయములో తన మహిమార్ధం పనిచేసేలా వారి హస్తాలను కదిలించాడు. అలాంటి వారిలో ఎస్తేరు ఒకటి. పరిశుధ్ధ గ్రంథంలో నేహేమ్యా తరువాత ఎస్తేరు గ్రంథం వచ్చినప్పటికిని నేహెమ్యా కార్యక్రమ-ములకు 30సం||లకు ముందే ఎస్తేరు కార్యక్రమములు జరిగినవి. ఈ కార్యములు జరిగిన స్థలము పారసీక సామ్రాజ్యము యొక్క రాజధానియైన షూషనులోను, చక్రవర్తి అంతఃపురములో జరిగినవి.
పర్షియా మహా సామ్రాజ్యానికి దర్యావేషు కుమారుడైన అహశ్వేరోషు చక్రవర్తిగా ఉన్నాడు. ఇతని సామ్రాజ్యం హిందూ దేశము నుండి కూషు దేశం వరకు 127 సంస్థానములు. పారసీక, మాదీయ దేశాల పరాక్రమశాలులను, సంస్థానాధి-పతులనందరినీ ఆహ్వానించి దాదాపు ఆరు మాసములు తన రాజ్య ప్రభావైశ్వర్యాలను, మహాత్యాతిశయ ఘనతలను ప్రదర్శిస్తూ వచ్చాడు. ఏడురోజుల విందు తరువాత తన భార్య అయిన వష్తీ రాణి అందాన్ని చూపించాలనుకున్నాడు. కాని అవిధేయురాలైన వష్తీ రాణి యొక్క మొండితనము వల్ల రాజు కోపగించుకొని తనను రాణి పదవి నుండి తొలగించాడు. అంతేగాక ప్రతీ యింటిలోను స్త్రీలు పురుషులకు లోబడాలని దేశమంతటా చాటించాడు. తరువాత యుద్ధములలో ఓడిపోయి నాలుగు సంవత్సరములు గడిచినపిమ్మట ఒకనాడు అనేక మంది కన్యకలలో ఒకతిగా ప్రత్యేకించబడి ఎన్నుకొనబడింది యూదురాలైన “హదస్సా”. హదస్సా అనగా గొంజి చెట్టు. గొంజి చెట్టు అన్ని వృక్ష జాతులలో చిన్నది. గొంజి చెట్టు లాంటి సామాన్య అనాధ బాలికయైన హదస్సను దేవుడు ఎస్తేరు అనగా నక్షత్రంగా మార్చి దుఃఖాంధ-కారంలో మునిగిపోయిన ప్రజలమధ్య ప్రకాశింపజేసాడు.
రాజు దగ్గర ఎంచబడిన స్త్రీలంతా ఉపపత్నులుగా ఎంచబడ్డారు కాని ఎస్తేరు జీవితం పట్ల దేవునికి గల ఉన్నతమైన ఉద్దేశం ప్రకారం అహశ్వేరోషు ఆమె పట్ల ప్రేమను, దయను కలిగించాడు. ఈ విధంగా దేవుని నిర్ణయం చొప్పున ఆమె రాణిగా చేయబడింది. ఆమె గుణ లక్షణాలు అందుకు దోహదపడ్డాయని చెప్పవచ్చు.
ఎస్తేరు చిన్న నాటినుండి సంరక్షకునిగా ఉన్న మొర్దెకైకి సంపూర్ణ విధేయత చూపించింది. దేవుని సహాయం కొరకు చూస్తూ మొర్దెకై సలహా ప్రకారం పని జరిగించేందుకు తన ప్రాణాన్ని సహితం లెక్కచేయలేదు. తరువాత అహశ్వేరోషు రెండవ సంస్థానములో ఉన్న ప్రధాన మంత్రి, అమలేకీయుల హగగు వంశాస్తుడైన హామాను యూదులను నాశనము చేయవలెనని తాకీదులు వ్రాయించు కొనవలెనని పనిన పన్నాగ-మును దేవుడు ఎస్తేరు ద్వారా తన ప్రజలను రక్షిస్తాడు. అధికార దుర్విని-యోగామునకు పాల్పడిన హామాను ఆతని కుటుంబమంతా ఉరితీయించబడ్డారు. తరువాత మొర్దెకై ఆ దేశములో రెండవ మానవుడిగా హెచ్చింపబడ్డాడు. ఆయన యూదుల యొక్క సంరక్షకునిగా మార్చబడడం ఈ గ్రంథం ముగింపులో గమనించగలం.
సారాంశం: మన జీవితాల్లో కొన్ని పర్యాయములు ఎన్నిక లేనివిగా, అల్పమైనవిగా కనిపించవచ్చు. మన జీవితంపట్ల దేవుని ప్రణాళిక ఎట్టిదో, మన ద్వారా ఆయన ఏ సంకల్పమైతే నేరవేర్చుకొనబోతున్నాడో మనకు అర్ధం కాదు. కానిదేవుడు మన జీవితాల్లో అనుమతించిన ప్రతీ పరిస్థితిని సంతోషంగా స్వీకరిస్తే, హదస్సాను ఎస్తేరుగా మార్చిన దేవుడు ఎందుకూ పనికిరాము అని అనుకుంటున్నా మనలను దేవుడు అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. కనుక అన్ని విషయాల్లో దేవుని పట్ల విధేయత చూపించే వారముగా నడచుటకు ప్రయత్నిద్దాం.

చిలుక పాట

 

ఒకానొక ఊరిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిలక వుంది. అది తన పిల్లలు పెద్దవవుతుండడంతో బయటకువెళ్లి ఏదైనా అపాయంలోపడతాయేమోనని భయపడి, ఒకరోజు రెపరేపా రెక్కలుకొట్టుకుంటూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్ని చూసి పిల్లలారా.., రండి మీకొక మంచి పాట నేర్పిస్తాను. అంది. సంతోషంతో ఎగురుకుంటూ వచ్చిన పిల్లలకు, వేటగాడొస్తున్నాడు జాగ్రత్త..! గింజలు విసురుతాడు జాగ్రత్త..! వలవేస్తాడు జాగ్రత్త..! పట్టుకుంటాడు జాగ్రత్త..! మెడ విరుస్తాడు జాగ్రత్త.. ! అనే పాటనేర్పింది.
అతి త్వరలోనే ఆ పాటని చక్కగా నేర్చేసుకున్న ఆ పిల్లలు బహురమ్యంగా పాడటం మొదలుపెట్టాయి. హమ్మయ్యా..! వేటగాడొచ్చినా నా పిల్లలకి ఇంకేం పరవాలేదు. అనుకొని వేటకొరకు అడవులలోకి తుర్రున వెళ్ళిపోయింది ఆ తల్లి చిలుక.
ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే చిలుక పిల్లలు వేటగాడొస్తున్నాడు జాగ్రత్త..! అని పాడసాగాయి. అది విన్న వేటగాడు హడలిపోయి చెట్టుచాటున నక్కి పోనీ గింజలు విసిరిచూద్దాం.. అని గింజలు విసిరాడు. వెంటనే ఆ చిలుక పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త..! అని పాడసాగాయి. ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏంచెయ్యాలో అర్ధంకాక వలవేసాడు. ఈలోగా వలవేస్తాడు జాగ్రత్త..! అని పాడుతూ ఆ చిలుకలు అతడు విసిరిన వలపై వ్రాలాయి. పాడుకుంటూ గింజలు తింటున్న చిలుకల్ని ఒక్కక్కటిగా పట్టుకొని మెడవిరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ చిలుకలు మెడ విరు...స్తా......డు........ అంటూనే చచ్చిపోయాయి.
అయ్యో... ఈ చిలుకలు పాట అయితే నేర్చుకున్నాయి గాని, దానిలోని అర్ధాన్ని గ్రహించుకోలేదు. నేడు మనలో అనేకులు చక్కని క్రైస్తవపాటలు పాడుతున్నాము. దేవుని వాక్యం నేర్చుకుని చక్కని ప్రసంగాలు చేస్తున్నామే కాని, క్రీస్తుకి నిజంగా మన హృదయాల్లో చోటును ఇచ్చి ఆయన మాటల్లోని సత్యాన్ని గ్రహించి, దానిని మన జీవితాలకు అన్వయించుకుని జీవించుటలేదు.
అందుకే ప్రభువు అంటున్నారు. మీ పాటల ధ్వని నాయొద్దనుండి తొలగనియ్యుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సులేదు. - (Amos ఆమోసు 5:23)
అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. - (John యోహాను 4 :23,24)
మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. - (Galatians గలతియులకు 5:25)

పది ఆజ్ఞలు

  • నీ దేవుడనైన యెహోవాను నేనే


  1. "నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు"
    మనం దేవుని పట్ల భయభక్తులు కలవాళ్ళమై అన్నిటికంటే దేవుని మీదే ప్రేమను నమ్మకాన్ని కలిగి ఉండాలి.
  2. "నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింప కూడదు."
    మనం దేవుని పట్ల భయభక్తులు గలవాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. ఆయన పేరును శపించడానిగ్గాని, ఒట్టుపెట్టుకోడానిగ్గాని, అబద్దాలు చెప్పటానిగ్గాని, మోసగించడానిగ్గాని, మంత్ర తంత్రాలు చెయ్యడానిగ్గాని ఉపయోగించ కూడదు. అయితే అన్ని కస్ట సమయాల్లో ఆయన్ని పేరు పెట్టి పిలిచి, ప్రార్థించి, స్తుతించి, వందనాలు చెల్లించాలి.
  3. "విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము."
    మనం దేవుని పట్ల భయభక్తులు కలవాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. ఆయన వాక్యాన్ని బోధను కాదన కూడదు, నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఆ వాక్యాన్ని పవిత్రమైందిగా ఎంచి, సంతోషంతో విని, మనసారా నేర్చుకోవాలి.
  4. "నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కల్గునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము"
    మనం దేవుని పట్ల భయభక్తులు కలవాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. మన తల్లిదండ్రులగ్గాని, అధికారంలో ఉన్న ఇతరులగ్గాని కోపం తెప్పించ కూడదు, వాళ్ళని అవమానించ కూడదు. అయితే వాళ్ళను గౌరవించి, ఉపచారం చేసి, వాళ్ళకి విధేయులంగా ఉండి తగిన ప్రేమను, ఘనతను వాళ్ళపట్ల చూపించాలి.
  5. "నరహత్య చేయకూడదు"
    మనం దేవుని పట్ల భయభక్తులు కలవాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. మన పొరుగు వాడికి హాని కలిగించే ఏ పనీ చెయ్యకూడదు. అయితే ప్రతీ అవసరంలో అతనికి సాయపడుతూ మంచి స్నేహితులంగా ఉండాలి.
  6. "వ్యభిచరింపకూడదు
    మనం దేవుని పట్ల భయభక్తులు గల వాళ్ళమై, ఆయన్ని ప్రేమించాలి. మనం మాటల్లో చేతల్లో పవిత్రంగా ఉండి గౌరవంగా బ్రతకాలి. భార్యా భర్త లిద్దరూ ఒకళ్ళ నొకళ్ళు ప్రేమించుకుంటూ ఘనపర్చు కోవాలి.
  7. దొంగిలింపకూడదు
    మనం దేవుని పట్ల భయభక్తులు గల వాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. మన పొరుగు వాళ్ళ ఇళ్ళను గాని, ఆస్తిని గాని, ధనాన్ని గాని మనం తీసికో కూడదు, అన్యాయం చేసో, మోసం చేసొ దాన్ని స్వంతం చేసుకోడానికి పూనుకో కూడదు. అయితే వాళ్ళు తమ ఆస్తిని, జీవనోపాధిని అభివ్రుద్ధి చేసుకొంటూ కాపాడుకోటానికి వాళ్ళకు సాయపడాలి.
  8. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము చెప్ప్పకూడదు
    మనం దేవుని పట్ల భయభక్తులు గల వాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. మన పొరుగువాడి మీద అబద్దాలు చెప్పకూడదు. అతని మీద చెడ్డమాటలు చెప్ప కూడదు. అయితే అతని పక్షంగా మాట్లాడి, అతని గురించి మంచి మాటలు చెప్పి అతని ప్రవర్తన, మాటల పట్ల ప్రేమ భావాన్ని కలిగుండాలి.
  9. నీ పొరుగువాని ఇల్లు ఆశింప కూడదు
    మనం దేవుని పట్ల భయభక్తులు గల వాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. మన పొరుగువాని ఆస్తినిగాని, ఇంటినిగాని సొంతం చేసుకోటానికి కుట్ర పన్న కూడదు. దొంగ పత్రాలు పుట్టించ కూడదు. అయితే ఆ ఆస్తి అతనికే ఉండేలా మనం చెయ్య గలిగినంత సాయం చెయ్యాలి.
  10. నీ పొరుగువాని భార్యనైనను, దాసుడనైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు.
    మనం దేవుని పట్ల భయభక్తులు గల వాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. మనం మన పొరుగువాని భార్యను గాని, పనివాళ్ళను గాని, పశువులను గాని బలాత్కారం చేసో, మోసం చేసో, లాలించో సొంతం చేసుకో కూడదు. అయితే అతని భార్య, పనివాళ్ళు, పశువులు అతనితోనే ఉండేలా చెయ్యదగినంత సాయం చెయాలి.

 
Copyright © 2014. JESUS | Distributed By My Blogger Themes | Designed By OddThemes