క్రీస్తు శారిరదారిగాఉన్న దినములలో ఆయన అనేక స్థలములలో సంచారము చేసాడు,ఆయన ప్రతి అడుగు మనకు శ్రేష్టమైన పాఠాలను నేర్పిస్తుంది,ఆయన ప్రతి కదలిక,మౌనం,మాట,ప్రయాణం,అన్ని లోతైన అనుభావలోనికి మన
విశ్వాసాన్ని నడిపిస్తాయి. అప్పుడే సూర్యుడు తన పనిని ముగించి
అస్తమిస్తున్నాడు.ప్రభువు తన శిష్యులతో ప్రయాణాన్ని ఒక దోనెలో అద్దరికి
ప్రయాణమయ్యాడు,సముద్రములో దోనే నెమ్మదిగా సాగుతుంది,అంతలోనే తుఫాను
ప్రారంభమైంది.అందులోనే కొన్ని పాఠాలు. మార్కు సువార్త 4:31-5:1 చదవండి .
ఆయన ఉన్న దోనే తుఫాను అనుభవించింది:- ”ఆయన ఉన్న దోనే మీద అలలు కొట్టినందున” 37 వ వచనం,మరి కొన్ని దోనేలు ఆయనను వెంబడించాయి,తుఫాను మాత్రం ఆయన ఉన్న దోనేకే,ఆయన
ఉన్న మనజీవితాలలో తుఫానులు,ఏ దిశనుండి వస్తాయ ఆకస్మికంగా మీద
పడతాయి,వ్యాది,ఆర్ధిక ఇబ్భందులు,తిరగుభాట్లు,అవమానాలు,నిందలు,ఆయన
ఉన్నందుకే,మన సద్భక్తి ఈ తుఫానుకు కారణం,(II తిమోతి 3:2)ఆయన లేని దోనేలు
ప్రశాంతగా ఉన్నాయి,తుఫాను అనుభవాలు లేవు.మన శ్రమ మన నింద ఆయన మనతో ఉన్నాడు
అని మన భక్తి సమున్నత స్థితిలో ఉంది అనటానికి సంకేతం,అన్నలు శ్రమ
పెట్టారు..యోసేపు శ్రమ పెట్టబడ్డాడు.సౌలు శ్రమపెట్టాడు.. దావీదు శ్రమ
పెట్టబడ్డాడు.కల్దియుల అధికారులు శ్రమపెట్ట్టారు..దానియేలు శ్రమ
పెట్టబడ్డాడు. మనము శ్రమలు అనుభవించే స్థానములో ఉండాలి,ఆయన
ఉన్నందున.ప్రియులారా! ఆయన లేకుండ సుఖమెందుకు,ఏమైనా కాని!ఎన్నైనా రానీ!ఎంత
దూరమైన సరే!ఆయన తో ఉంటే చాలు. ప్రవక్త హబక్కుకు తాత్పర్యం ఇదే,తోటలో
అంజూరపు పూత లేదు, ద్రాక్షా ఫలం లేదు, ఒలీవా కాపు లేదు,దొడ్డిలో గొర్రెలు
లేవు ,సాలలో పశువులు లేవు, కానీ....యెహోవా ఉన్నాడు..మనం ఆనందించటానికి లోకంలో ఏవి కారాణాలు కావు, క్రీస్తు మాత్రమే. చుట్టూ పరిస్థితులు భీతి గొల్పెవిగా ఉన్నాపరవాలేదు లోపల ఆయన ఉన్నాడు.తుఫాను ఉండనీ..నీళ్ళు దోనెలో నిండనీ..ప్రభువు ఉన్నాడు అదిగో అమరములో.
ఆయన ఉన్నదోనే అద్దరి చేరుతుంది :- ”అద్దరి
నున్న గేరసేనుల దేశమునకు వచ్చిరి” 5:1 వచనం,ఆయన లేని దోనేలు తీరము
చేరలేవు,ఆయన ఉన్న దోనే తుఫాను అనుభవించి,ఎదిరించి,అద్దరి చేరింది.ఇప్పుడు
సముద్రము లేదు తుఫాను లేదు,సాదారణపరిస్థితులు ఏర్పడ్డాయి.ఎప్పటికి శ్రమలు
ఉండవు,అవి ఒక దినాన ఆగిపోతాయి,యోసేపు ఎల్లకాలం గుంతలో లేడు,ఎల్లకాలం
దాసుడుగా లేడు,ఎల్లకాలం చెరసాలలో లేడు, కానీ సింహాసనంపై మరణం వరకు
ఉన్నాడు(ఆది కాండం 39-50 అధ్యాయాలు)..జీవితకాలం దావీదు తరుమబడలేదు సౌలు
మరణం వరకే.సింహాసనం పై మరణం వరకు ఉన్నాడు.శ్రమలోనుండి వీలైనంత త్వరగా
బయటపడాలని అడ్డదారులు వెతుకోకూడదు,కొంచెం కాలం ఆయన మననుండి ఆశించిన
ఫలితాలు వచ్చిన తరువాత అన్ని ఆగి పోతాయి.ఆయనే అద్దరికి వెళ్దామన్న వాడు
తుఫాను మద్యలో విడిచి వెళతాడా?.అందరు విడిచివెళ్ళవచ్చు,అద్దరి చేరేంత వరకు
ఆయన విడవడు.నీ జీవితంలో ధరి చాల దగ్గరగా ఉంది..అన్ని సమసిపోతాయి కొంచెం
ఓపికతో ఉండు ఆయన ఉన్నాడు కదా దోనే అద్దరి చేరుతుంది.కనులెత్తి చూడు అదిగో
అతి సమీపంలో అద్దరి ..నెమ్మది కలుగుతుంది.(యెషయా 38:17). అదిగో తీరం .....
ఆయన ఉన్న దోనే తుఫానును ఎదుర్కొనింది:-
ఆయన లేని దోనేలు తుఫానులోఆయనను వెంబడించకుండా వెనుదిరిగాయి.”అందుకాయన
లేచి గాలిని గద్దించి” 39 వచనం. తుఫానులు మన నాశనానికి రావండి!విశ్వాసంలో
రాటుదేలుట కొరకే.జీవిత తుఫానులలో నాశనమైన భక్తులు ఎవరున్నారు?యోబు తుఫానును
ఎదుర్కొన్నాడు (యోబు 19:25-26)తుఫాను తప్పించుకొనే ప్రయత్నం చేస్తే తుఫాను
గెలిచినట్లు,షడ్రక్ మెషక్ అబెడ్నాగో, అగ్నిని సైతం ఎదిరించారు,కారణం
దోనెలో ఆయన ఉన్నాడు.ఆయన సమస్తమును ఎలుబడిచేస్తున్నాడు,ఆయన ఉన్న దోనేలు
కరవు,శ్రమ, భాధా,హింసా,దేనినైన ఎదుర్కొంటాయి,దోనే ఎంత తీవ్రమైన తుఫానులలో
నడిచిన భయపడకూడదు అయన ఉన్నాడు.ఆయన నీలో ఉన్నాడా? అయితే దేన్నీ
ఎదుర్కొనటానికైనా సిద్ధపడు.లోకమంతా ఏకమై మనకు వ్యతిరేకమైన ఎదుర్కొనటానికి
సిద్ధపడు.ఆయనా ఉన్నాడు దోనెలో అదిగో అమరములో సరియైన సమయంలో ఆయన
లేస్తాడు.అన్నిటిని నిమ్మలపరుస్తాడు.అన్నిటిని
గద్దిస్తాడు..(కీర్తనలు103:19) అదిగో ఆయన గద్దింపు ....
0 comments:
Post a Comment