1. ఈ రోజునే క్రొత్త ఆరంభాన్ని ప్రారంభిద్దాము: పూర్తిగా ఓడిపోయిన
తప్పిపోయిన కుమారునికి, తండ్రి ప్రశస్తమైన వస్త్రమును తెచ్చి తొడిగించారు.
ఇదియే సువార్త యొక్క సందేశము. తప్పిపోయిన (ఓడిపోయిన) వారికి కూడా దేవుడు
అతిశ్రేష్టమైన వాటిని, శోధింపశక్యముకాని ఐశ్వర్యమును ఇస్తాడు. దేవుడు ఎవరి
విషయములోనైనను నిరాశపడడు లేక వారిని ఎన్నటికినీ విడువడు కాబట్టి వారు
క్రొత్త ఆరంభాన్ని ప్రారంభించవచ్చును. గత సంవత్సరములో తప్పిపోయిన నీవు
ఎటువంటి తప్పిదములు చేసినప్పటికినీ, ఇప్పుడు దేవునితో నీవు క్రొత్త
ఆరంభాన్ని ప్రారంభించవచ్చును. నీవు వెయ్యిసార్లు తీర్మానాలు తీసుకొని
ఆరంభించి ఓడిపోయినప్పటికినీ, నీవు 1001వ సారి ఈరోజు ఆరంభించవచ్చును.
అయినప్పటికీ నీ జీవితములో మన అవసరమంతటికీ చాలిన దేవుడు అద్భుతకార్యము
చేయగలడు. ఇప్పటివరకు నీవు అసాధ్యమనుకున్న వాటిని దేవుడు నీలో చెయ్యగలడని
ధృడముగా ఆయనను విశ్వసించి మరియు ఆయనను నమ్ముము (రోమా 4:21).
2. దేవుని వాగ్దానములన్నిటిని స్వతంత్రించుకోవాలి: ప్రతిరోజు నీవు దేవుని వాగ్దానములను విశ్వసించి (వాటిని ప్రార్ధనగా చేసి) స్వతంత్రించుకున్నట్లయితే (పొందుకున్నట్లయితే) గత సంవత్సరములన్నిటికంటే ఈ సంవత్సరము చాలా మంచిదిగా ఉంటుంది. ఇశ్రాయేలీయులందరినీ కానాను దేశానికి తీసుకువెళతానని దేవుడు వాగ్దానము చేశాడు (నిర్గమకాండము 3:17). యెహోషువ మరియు కాలేబు మాత్రమే దానిని విశ్వసించారు. కాబట్టి వారు మాత్రమే కానానులో ప్రవేశించారు. నీ హృదయములో నీవు విశ్వసించిన దానంతటినీ, నీ నోటితో ఒప్పుకొంటూ ఉండాలి (రోమా 10:8,9). ఇక్కడ ఎనిమిది వాగ్దానాలు ఉన్నవి. నీవు వాటిని హృదయములో విశ్వసించి మరియు నోటితో ఒప్పుకొంటూ (వాటిని ప్రార్ధనగా చేయుచూ) ఈ సంవత్సరము వాటిని స్వతంత్రించుకొనుము.
1. తండ్రియైన దేవుడు ప్రభువైనయేసును ప్రేమించినట్లే నన్ను కూడా ప్రేమించుచున్నాడు -కాబట్టి నేను ఎల్లప్పుడు ఆనందించెదను (యోహాను 17:23).
2. దేవుడు నా యొక్క సమస్త పాపములను క్షమించియున్నాడు -కాబట్టి నేను ఎన్నటెన్నటికీ నేరారోపణలో జీవించను (1యోహాను 1:9 మరియు హెబ్రీ 8:12).
3. దేవుడు నన్ను ఎల్లప్పుడు పరిశుద్ధాత్మతో నింపును -కాబట్టి ఎటువంటి పని (కార్యము)నైనను చేయుటకు కావలసినంత శక్తిని కలిగియుందును (లూకా 11:13).
4. దేవుడు నా యొక్క సరిహద్దులన్నిటినీ, నివాసస్థలము యొక్క పొలిమేరలను నిర్ణయించియున్నాడు -కాబట్టి నేను ఎల్లప్పుడు సంతృప్తి కలిగియుందును (అపొ. కా. 17:26,27 మరియు హెబ్రీ 13:5).
5. దేవుని ఆజ్ఞలన్నియు కేవలము నా మేలుకొరకు మాత్రమే ఉన్నవి -కాబట్టి వాటన్నిటికీ విధేయత చూపించాలని కోరుచున్నాను (1యోహాను 5:3 మరియు ద్వితీ.కా. 10:13).
6. నన్ను ప్రభావితము చేసే (నేను ఎదుర్కొనే) ప్రతి వ్యక్తియు మరియు ప్రతి పరిస్థితి కూడా దేవుని ఆధీనములో ఉన్నవి -కాబట్టి సమస్తమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను (రోమా 8:28, ఎఫెసీ 5:20, 1థెస్స 5:18).
7. ప్రభువైనయేసు సాతానును నశింపజేసి మరియు సాతాను నుండి నన్ను విడిపించియున్నాడు -కాబట్టి నేను ఎన్నటెన్నటికి భయపడను (హెబ్రీ 2:14,15; 13:6).
8. దేవుడు నన్ను ఆశీర్వాదముగా చేయాలని కోరుచున్నాడు -కాబట్టి నేను ఇతరులకు ఆశీర్వాదముగా ఉందును (ఆదికాండము 12:2, గలతీ 3:14).
దేవునివాగ్దానము మరియు మనవిశ్వాసము, రెండు కరెంటు తీగలవలె ఉన్నవి. ఆ రెండు తీగలు ముట్టుకొనినప్పుడే (స్విచ్ వేసినప్పుడు) తీగలలో గుండా కరెంటు ప్రవహిస్తుంది. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ నీ జీవితములో నెరవేరి, నీ అనుభవమగునట్లు నీవు వాటన్నిటినీ విశ్వసించి, ప్రార్ధనగా చేసినట్లయితే ఈ సంవత్సరములో అవి నీలో నెరవేరును.
3. ఇతరుల యెడల కనికరము కలిగియుండుము: దేవుడు నీ యెడల ఎంత కనికరము చూపించియున్నాడో, దానిని ఈ సంవత్సరములో ఎప్పుడైనను మరువవద్దు. అలాగే ఇతరుల యెడల కనికరము కలిగియుండుము. ప్రభువుయొద్ద నుండి నీవు ఎంతో సమృద్ధిగా, ఉచితముగా పొందుకొనియున్నావు. అలాగే నీవు కూడా ఇవ్వగలిగిన దానిని ఉచితముగా ఇవ్వుము (మత్తయి 10:8). ఏ విధముగానైనను నీకు ఋణపడియున్నవారిని లేక నిన్ను గాయపరిచిన వారిని లేక నీకు కీడు చేసినవారిని క్షమించుము. గత కక్షలన్నిటినీ భూస్థాపితము చేయుము మరియు అందరియెడల కనికరము కలిగి ఈరోజు ఒక నూతన ఆరంభాన్ని ప్రారంభించుము.
4. ప్రతిరోజు ఆత్మలో జీవించుము: అపొస్తలుడైన యోహాను "ఆత్మలో" ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని బూరధ్వని వంటి గొప్ప స్వరాన్ని విన్నాడు (ప్రకటన 1:10). నీవు కూడా ఈ సంవత్సరమంతయు ఆత్మలో జీవించినట్లయితే నిన్ను ఎల్లప్పుడు ప్రోత్సహించి, నడిపించే ప్రభువు స్వరాన్ని బూరధ్వని వంటి శబ్దమువలె వినెదము. పాపము విషయములో సున్నితముగా ఉండి మరియు దేవుని యెదుట దీనులమై (ఎల్లప్పుడు దేవుడు మనకెంత అవసరమో ఎరిగియుండి) ప్రతిరోజు ఆత్మపూర్ణులముగా ఉండాలి.
5. దేవునిని ఆరాధించే వాడుగా ఉండుము: దేవుడు ముఖ్యముగా ఆయనను ఆరాధించేవారిని కోరుచున్నాడు అనగా ఆయనను మాత్రమే కోరుకొనుట. అప్పుడు యెషయా చూచినట్లు నీవు కూడా దేవుని మహిమను చూచెదవు. వెంటనే యెషయా తన యొక్క సొంత పాపమును చూచాడు. అలాగే నీవు కూడా చూచెదవు (యెషయా 6:1-5). దేవునిని ఆరాధించేవాడుగా ఉండుము అప్పుడు దేవుడు నీ జీవితములో ఏ విషయాలలో నీవు క్రీస్తులాగా లేవో బయలుపరుస్తాడు. అట్టివాటి నుండి మనము పరిశుద్ధపరచబడాలి. ఆవిధముగా ఈ సంవత్సరములో ప్రతిదినము కొంచెం కొంచెం ఆయన స్వభావములో నీవు పాలివాడవగునట్లు దేవుడు చేస్తాడు.
6. ఈ సంవత్సరము నీవు పరలోకమును కొంత అనుభవించగలవు: మీ దినములను మీ సంతతివారి దినములను భూమి మీద పరలోకజీవితము జీవించవచ్చని పాతనిబంధన కాలములో మోషే ఇశ్రాయేలీయులతో చెప్పాడు (ద్వితీ. కా. 11:21). క్రొత్తనిబంధన కాలములో ఇటువంటి జీవితమే దేవుని చిత్తమైయున్నది. ఈ సంవత్సరములో మీ ఇంటిలోను మరియు సంఘములోను క్రీస్తులో ఉన్న సంతోషము, సమాధానము, పవిత్రత మరియు మంచితనమును ఎల్లప్పుడు మీరు అనుభవించాలని దేవుడు కోరుచున్నాడు. ప్రభువైనయేసు సంతోషము, సమాధానము మొదలగువాటితో నిండిన పరలోకజీవితము జీవించారు. మీరు క్రీస్తుయేసునే చూస్తూ ఆయనలో ఆనందిస్తూ మరియు ఆయనను వెంబడిస్తూ ఉంటే అప్పుడు ప్రతిరోజు ఈ లోకములో పరలోక జీవితాన్ని అనుభవించవచ్చును.
7. ఈ సంవత్సరము ప్రభువు నిన్ను ఇతరులకు ఆశీర్వాదముగా చేస్తాడని నమ్ముము: దేవుడు అబ్రాహాముతో "నేను నిన్ను ఆశీర్వదించి....... భూలోక వంశములన్నియు నీ యందు ఆశీర్వదించబడునట్లు చేసెదనని చెప్పారు" (ఆదికాండము 12:2,3). ఈ ఆశీర్వాదమును పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు మనము స్వతంత్రించుకొనవచ్చును (గలతీ 3:13,14). నీ గిన్నె నిండి పొర్లి ఇతరులలోనికి పారి (జీవ సరఫరా జరిగి) అనేకులు ఆశీర్వదించబడునట్లు, దేవుడు నిన్ను తైలము (పరిశుద్ధాత్మ)తో అభిషేకించాలని కోరుచున్నాడు. ఎలీషా కాలములో, బీద విధవరాలి పాత్ర నూనెతో నింపబడియుండగా, ఆమె ఇరుగుపొరుగు వారి పాత్రలన్నిటిలో ఆ నూనెపోసి వాటిని నింపెను (2రాజులు 4:1-7). ఈ సంవత్సరములో నిన్ను కలిసే ప్రతిఒక్క వ్యక్తిని ఆశీర్వదించుటకు అవసరమైన దానికంటే ఎక్కువగా దేవుని శక్తిని మరియు ఆశీర్వాదమును పొందునట్లు దేవుడు నిన్ను అభిషేకించును. ఆ విధవరాలు ఇతరులను ఆశీర్వదించినట్లు, నీవును ఇతరులను ఆశీర్వదించెదవు. కాబట్టి నీలోనుండి జీవ జలనదులు అనేకులలోనికి ప్రవహించునట్లు చేయును. కాని దేవుని ఆశీర్వాదమును నీకొరకే ఉంచుకొనినయెడల, మన్నాను రాత్రికుడా ఉంచితే ఎలా కంపుకొడుతుందో అలాగే జరుగుతుంది. ఇతరులకు నీళ్ళుపోయువారికి దేవుడే నీళ్ళు పోయును (సామెతలు 11:25). అది నీ జీవితములో జరుగును గాక.
ఈ సంవత్సరము క్రీస్తును కలిగిన అటువంటి జీవితము కలిగియుందుముగాక ఆమేన్.

0 comments:
Post a Comment