“మనుష్యుల హృదయ కాఠిన్యమునుబట్టి” (మత్తయి 19:8)
పాత నిబంధనలో ఎల్లప్పుడు బాహ్య విషయములనే ముఖ్యముగా చెప్పేవారు.
ధర్మశాస్త్రము బాహ్య విషయములలోనే పరిశుద్ధతను ముఖ్యముగా చెప్పుచున్నది.
కాని క్రొత్త నిబంధనలో దీనికి వేరుగా “గిన్నె లోపల” శుద్ధినిగూర్చి మొదట
చెప్పబడినది (మత్తయి 23:25,26).
ఒకసారి అంతరంగ జీవితము కడుగబడినయెడల, బాహ్యజీవితము కడుగబడనవసరము లేకుండానే
కడుగబడుతుందని ప్రభువైన యేసు 26 వ వచనములో చెప్పారు. దీనిని మత్తయి
5:21-30 లో మనము తేటగా చూడవచ్చును. కోపమునుండి ఒకని హృదయము కడుగబడినయెడల,
అతడు హత్య చేసే అవకాశము అసలు ఉండదు. అలాగే లైంగికమైన మురికి తలంపులనుండి
ఒకని హృదయము కడుగబడినయెడల, అతడు బాహ్యముగా వ్యభిచారము చేసే అవకాశము అసలు
ఉండదు. గిన్నె లోపల శుద్ధి చేసినయెడల వెలుపల కూడా శుద్ధి అగును.
ఒక సంఘములో సినిమాలు చూడకుండుట, పొగత్రాగకుండుట,
మత్తుపానియాలు త్రాగకుండుట, ఆభరణములు వేసుకొనకుండుట మొదలైన బాహ్యమైన
విషయములు ముఖ్యముగా చెప్పినయెడల, అది పాత నిబంధన సంఘము మాత్రమే అవుతుంది.
వాటినుండి విడుదల పొందుటకు మన దృష్టిని వాటిమీదకాక, వాటిని కలుగజేసే
అంతరంగములోని లోక సంబంధమైన మనస్సుమీద దృష్టిపెట్టాలి.
మనలను మనము తీర్పు తీర్చుకొననట్లయితే అంతరంగములో
పరిశుద్ధత ఉండదు. అంతరంగజీవితములో శుద్ధిఅగుట గూర్చి తరచుగా బోధించనియెడల
సంఘమును కట్టలేము. పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠిన
పరచబడకుండునట్లు ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడని బైబిలు
హెచ్చరించుచున్నది (హెబ్రీ 3:13-15; 10:25). చాలా క్రైస్తవ సంఘములలో ఇట్టి
బోధ చాలా తక్కువగా చేయబడుచున్నది. నిశ్చయముగా ప్రతిదినము చేయబడుటలేదు!
కాబట్టి వెలుపల మాత్రమే శుద్ధి చేయబడిన గిన్నెలవలె పరిసయ్యులను వారు
కనుచున్నారు.
ఇటింటిని దర్శించుట, సువార్త పరిచర్య చేయుట మొదలగు
పరిచర్యలనే ఎక్కువగా సంఘశాఖలలో చేయుదురు. ఇదంతయు మంచిదే. దేవుని వాక్యానికి
పూర్తిగా లోబడుటకు బదులు అనేకమంది విశ్వాసులు ఇటువంటివి చేయుట చాలా
దురదృష్టకరము.
ఆయన చెప్పిన వాటన్నిటిని క్రైస్తవులు గైకొనాలని ప్రభువైన యేసు చెప్పారు (మత్తయి 28:20). బలులు అర్పించుటకంటే మాట వినుటనే దేవుడు కోరుచున్నాడు (1 సమూయేలు 15:22).
దేవునియెడల మన ప్రేమను వ్యక్తపరచుటకు మనము శ్రమలలోగుండా వెళ్ళాలని దేవుడు
కోరుచున్నాడని అన్యులు తలంచెదరు. ఈ అన్యసంస్కృతి భారతదేశములో ఎక్కువగా ఉంది
మరియు దురదృష్టకరముగా అదే సంస్కృతి మన దేశములోని క్రైస్తవ్యములోనికి
వచ్చినది. ఉద్యోగమునకు రాజీనామా చేయుట, కష్టమైన ప్రదేశమునకు వెళ్ళుట మరియు
అనేక క్లిష్ట పరిస్థితులలోగుండా వెళ్ళుట మొదలైనవి ఆత్మీయతగా వారు
చూస్తున్నారు. వీటన్నిటిలో త్యాగము ఉండవచ్చును కాని అది దేవుని వాక్యమునకు
లోబడుటకు ప్రత్యామ్నాయముగా ఎన్నటికీ ఉండదు.
యోహాను 14:15 లో ప్రభువైన యేసు చెప్పినట్లుగా ఆయనయెడల
మనకున్న ప్రేమను బలులు, అర్పణలద్వారా కాదు కాని కేవలము ఆయన ఆజ్ఞలకు
లోబడుటద్వారా మాత్రమే వ్యక్తపరచగలము. మనము సువార్తికులమగుటకన్నా,
ఉద్యోగమును విడిచిపెట్టుటకన్నా లేక మన రాబడిలో 50% ఇచ్చుటకన్నా యేసు
ప్రభువు మత్తయి 5-7 అధ్యాయములలో చెప్పిన ప్రతిదానికి లోబడుటయే మనము ఆయనను
ప్రేమిస్తున్నామనుటకు ఋజువు. మార్తవలె విస్తారమైన పనులు చేయుటయే అనేక
క్రైస్తవ శాఖలలో ఉంది (లూకా 10-39-42). వంటగదిలో ఆమె ఎంతో యదార్ధముగా,
త్యాగపూరితముగా, స్వార్ధరహితముగా మరియు ఆసక్తితో ప్రభువుకు పరిచర్య
చేసింది. అయినప్పటికీ ప్రభువు ఆమెను గద్ధించాడు. ప్రభువుకు
త్యాగపూరితమైనదేదియు చేసినట్లు కనబడని మరియను చూచి ఆమె బాధపడి మరియు అమెను
విమర్శించింది. మరియ, ప్రభువుకొరకు దేనినైననూ చేయకముందే ఆయన పాద సన్నిధిలో
కూర్చొని, ఆయన వాక్యమును వినుటకు కనిపెట్టుకొనియున్నది. మన చిత్తప్రకారము
కాక దేవుని చిత్తప్రకారమే చేయునట్లు మనముకూడా ఇటువంటి వైఖరి కలిగియుండి -
విస్తారమైన పనులు పెట్టుకొనక ప్రభువు చెప్పినది విని మరియు దానికి లోబడాలి.
0 comments:
Post a Comment