Breaking
Loading...

Today's Quote

Today's Quote
Home » » దేవునికి కావలసిన వారు

దేవునికి కావలసిన వారు


నాడు దేవునికి
- ఎవరైతే ప్రతి దినము ఆయన ముఖము ఎదుట నిలువబడి ఆయన స్వరము విందురో
- ఎవరికైతే వారి హృదయములలో దేవునిపై కాక దేనిపైన కాని ఎవరిపైన కాని కోర్కె ఉండదో,
- ఎవరైతే ఏ రూపమునున్న పాపమునైనా ద్వేషించి వారి మార్గాలన్నిటిలో సత్యమును, నీతిని ప్రేమించునట్లు దేవుని యెడల గొప్ప భయము కల్గియుందురో,
- ఎవరికైతే కోపాన్ని మరియు కామపూరిత పాపపు ఆలోచనలను జయించి వారి ఆలోచనల్లో లేక వైఖిరిలో పాపము చేయుట కంటే చనిపోవుట మేలు అని తలంతురో,
- ఎవరి జీవిత శైలి ప్రతిదినము వారి సిలువ నెత్తికొని పరిపూర్ణులగుటకు సాగిపోవునట్లుండునో, మరియు ఎవరైతే వారి స్వంత రక్షణ ఎల్లప్పుడూ భయముతో వణుకుతో కొనసాగించుదురో
- ఎవరైతే పరిశుద్దాత్మతో పూర్తిగా నింపబడి, ఇంకొకరు వారి నెంతగా కవ్వించినా వారి యెడల చూపు ప్రేమ నుండి కదలకుండునట్లు ప్రేమలో వేరుపారి యుందురో
- ఎవరైతే మనుష్యుల యొక్క పొగడ్తలు లేక ఆత్మీయ ఎదుగుదల లేక దైవికముగా ఇవ్వబడిన పరిచర్య లేక మరి ఏ ఆధిక్యతైనా వారు పరిశుద్దులలో కడమ వాని కంటే కూడా తక్కువ వానిననే ఆలోచన నుండి తప్పించనంతటి దీనత్వములో వేరుపారి యుందురో
- ఎవరైతే దేవుని వాక్యము ద్వారా ఆయన యొక్క స్వభావమును మరియు ఉద్దేశ్యములను అర్ధము చేసికొని మరియు దేవుని వాక్యములో అతి చిన్న ఆజ్ఞకు కూడా అవిధేయత చూపకుండా లేక ఇతరులకు దానిని బోధించుటలో అలక్ష్యము చేయకుండా ఉండునట్లు వాక్యమును బట్టి వణుకుచుందురో
- ఎవరైతే మానవులయెడల దేవుని సంపూర్ణ ఉద్దేశ్యమును ప్రకటించుచూ ఆత్మీయ వ్యభిచారత్వమును మరియు వాక్యానుసారముకాని మానవ ఆచారములను బహిరంగపరచుదురో
- ఎవరైతే దైవభక్తి గూర్చిన మర్మము గూర్చియు, క్రీస్తు మానవ శరీరముతో వచ్చి ఆయన శరీరము ద్వారా ఒక నూతనమైనదియు మరియు జీవముగలదియునైన మార్గము తెరచెనను విషయము గూర్చి పరిశుద్దాత్మ యొక్క బయల్పాటు కలిగియుందురో
- ఎవరైతే ఆసక్తితో కష్టపడి పనిచేయువారై యుండి హాస్వానికి తావిచ్చువారును మరియు తీరికచేసికొని పిల్లలతో ఆడుట ఎలాగో తెలిసినవారును మరియు దేవుడు ప్రకృతిలో ఇచ్చిన మంచి విషయములను బట్టి సంతోషింపగలిగిన వారైయుందురో,
- ఎవరైతే సన్యాసులుగా నుండక, అదే సమయములో క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవిస్తూ కష్టమైన పరిస్థితులను గూర్చి భయపడరో,
- ఎవరైతే ఖరీదైన దుస్తులపై లేక క్రొత్త ప్రదేశాలను చూచుట యందు ఆసక్తి లేనివారై యుందురో మరియు ఎవరైతే వారి సమయాన్ని ఆత్మీయముగా లాభకరము కాని కార్యక్రమములపై వ్యర్ధ పుచ్చరో మరియు వారి యొక్క ధనాన్ని అనవసరమైన వాటిని కొనుటకు ఖర్చుచేయరో,
- ఎవరైతే రకరకాల రుచుల భోజన పదార్ధాల విషయంలో జయము పొందుదురో మరియు ఎవరైతే సంగీతానికి లేక ఆటలకు లేక చట్టబద్ధమైన ఏ కార్యక్రమమునకైనా భానిసకారో,
- ఎవరైతే ఇబ్బందుల కొలిమిలో, ధూషణలు, శ్రమలు, అపనిందలు, శారీరక అస్వస్థతలు, ఆర్ధిక ఇబ్బందులు మరియు బంధువుల నుండి మత పెద్దల నుండి వ్యతిరేకతలలో దేవుని చేత క్రమశిక్షణ పొందుదురో
- ఎవరైతే, వారిని వారు పాపులలో అధములుగా చూచుకొనుట వలన పాపులలో అత్యంత పాపుల యెడలను, విశ్వాసులలో చెడ్డవారి యెడలను సానుభూతి కలిగియుండి, వారిని గూర్చి నిరీక్షణ కలిగియుండి, కనికరముతో నిండియుందురో,
- ఎవరైతే తమ పరలోకపు తండ్రి ప్రేమ యందు లోతుగా వేరుకలిగి యుండుటచేత, దేని గూర్చియు ఎప్పుడు ఆతురత పడకయుండి, సైతాను గూర్చి, దుష్టులైన మనుష్యుల గూర్చి లేక క్లిష్ట పరిస్థితులు గూర్చి లేక దేని గూర్చియైనా భయపడకుందురో,
- ఎవరైతే అన్ని విషయములు వారి మేలుకొరకై సర్వాధికారియైన దేవుడు సమకూర్చి జరిగించునని నమ్ముటచేత ఎల్లప్పుడు, మనుష్యులందరి కొరకు, అన్ని సంగతుల గూర్చి మరియు అన్ని సమయములందు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశింతురో.
- ఎవరైతే వారి ఆనందాన్ని దేవుని యందు మాత్రమే కనుగొనుట చేత దేవుని యొక్క సంతోషాన్ని పొందిన వారై, చికాకుపర్చే భావాలను జయించుదురో,
- ఎవరైతే వారి కుండిన సహజ సిద్ధమైన సామర్ధ్యమందు నమ్మికయుంచక, అన్ని పరిస్థితులలో దేవుడే వారిని సిగ్గుపడనివ్వని సహాయకుడని నమ్మి జీవము గల విశ్వాసము కలిగియుందురో,
- ఎవరైతే వారి స్వంత గ్రహణశక్తి చెప్పు మాటలను బట్టి కాక పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి జీవించుదురో,
- ఎవరైతే నిజముగా క్రీస్తుచేత పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మము పొందుదురో (అంతేకాని ఏదో ఉద్వేగపూరితమైన నఖిళీ అనుభవము, లేక వేదాంత పరమైన వాదనతో ఒప్పింపబడుట కాదు),
- ఎవరైతే ఎల్లప్పుడూ పరిశుద్దాత్మ అభిషేకము క్రింద ఉండి, వారికి ఆయన ఇచ్చే మానవాతీత వరములతో నింపబడి యుందురో,
- ఎవరికైతే సంఘము క్రీస్తు యొక్క శరీరమని (ఒక సమాజము లేక మత సంస్థ కాదు) బయల్పడునో, మరియు ఎవరైతే వారి శక్తియుక్తులు, వారి వస్తు వాహనాలు మరియు ఆత్మీయవరాలు ఆ సంఘమును కట్టుటకు వెచ్చింతురో,
- ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా వారి నాలుకలకు కళ్లెమువేయుట నేర్చుకొందురో మరియు ఎవరి నాలుకలు ఎప్పుడూ దైవికమైన వాక్యముతో మండుచుండునో,
- ఎవరైతే అన్నిటిని విడిచిపెట్టి, ఎవరైతే ధనానికి కాని వస్తు వాహనాలకు కాని అతుక్కొని ఉండరో, మరియు ఎవరైతే ఇతరుల నుండి ఏ బహుమతులను ఆశించరో,
- ఎవరైతే వారి ఇహలోక అవసరాలన్నిటిని గూర్చి దేవునియందే నమ్మిక యుంచెదరో మరియు ఎవరైతే వారి వస్తు రూపమైన అవసరాల గూర్చి ఎప్పుడూ ఇతరులకు తెలియునట్లు ప్రవర్తించరో లేక వారి పడిన శ్రమల గూర్చి వారి మాటలలో కాని లేక ఉత్తరాలు మరియు నివేదికల ద్వారా గాని తెలియపర్చరో,
- ఎవరైతే మొండిగా నుండక మర్యాదగాను, విమర్శకు తావిచ్చువారి గాను మరియు తమకంటే పెద్దవారి నుండి మరియు జ్ఞానము గల సహోదరుల నుండి దిద్దుబాటు తీసుకొనుటకు ఆశ కలిగియుందురో
- ఎవరైతే ఇతరులను అదిగమించాలని లేక ఇతరులకు సలహా ఇవ్వాలని (అయితే అడిగినప్పుడు సలహా ఇచ్చుటకు సిద్ధముగా ఉండి) మరియు ‘నాయకులు’ గా ‘పెద్దలు’ గా అనిపించు కొనుటకు ఆసక్తిలేని వారుగా నుండి కేవలము సామాన్యమైన సహోదరులుగా మరియు అందరికి సేవకులుగా ఉండుటకు ఆశ కలిగియుందురో,
- ఎవరైతే ఇతరులు సులువుగా తమతో కలసిపోగలిగినట్లుయుందురో; మరియు ఎవరైతే యిబ్బంది పర్చబడుటకు ఇష్టబడుదురో మరియు ఇతరులు వారిని ఉపయోగించు కొనుటకు యిష్టపడుదురో,
- ఎవరైతే లక్షాధికారికిని భిక్షమెత్తుకొనువానికిని లేక తెలుపురంగు చర్మమునకును నలుపురంగు చర్మమునకును, తెలివితేటలు కలవానికిని తెలివిలేని వానికిని మరియు నాగరికులకు పల్లెటూరి వానికిని తేడా చూడక అందరిని ఒకేలా చూచుదురో,
- ఎవరైతే తన భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు లేక ఇతర విశ్వాసులను బట్టి వారికి క్రీస్తు యెడల నుండిన భక్తి భావము లేక దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుటను ఏ మాత్రము చల్లారిపోకుండా చూచుకొందురో,
- ఎవరైతే దేవుని నియమముల విషయములో రాజీపడుటకు సైతాను ఎటువంటి ఆశను చూపినా అటువంటి లంచమునకు (అది ఘనత లేక ధనము లేక ఇంకేదైనా కావచ్చు) లొంగరో,
- ఎవరైతే మత నాయకులకు కాని, ప్రభుత్వ అధినేతలకు కాని భయపడక క్రీస్తు కొరకు భయమునెఱుగని సాక్షులుగా నుందురో,
- ఎవరైతె దేవునిని కాదని ఈ భూమిపై నుండిన ఏ మానవుని సంతోషపర్చుటకు ఆశ చూపరో, మరియు దేవునిని సంతోషపర్చుటకు అవసరమైతే మనుష్యులందరినీ అభ్యంతరపర్చుటకు (కోపము వచ్చుటకు) ఇష్టపడుదురో,
- ఎవరైతే దేవుని మహిమ, దేవుని యొక్క యిష్టము మరియు దేవుని రాజ్యము మానవ అవసరము కంటే మరియు వారి స్వంత సౌఖ్యము కంటే ముందుగా నుండునో,
- ఎవరైతే దేవుని కొరకు "నిర్జీవ క్రియలు" చేయుట కొరకు ఇతరులచేత కాని, లేక వారి స్వంత ఆలోచన చేతకాని బలవంత పెట్టబడకుండా యుండి, వారి జీవితాల్లో దేవుని చేత బయల్పర్చబడినవి మాత్రమే చేయుటకు ఆసక్తి మరియు సంతృప్తి కలిగియుందురో,
- ఎవరైతే క్రైస్తవపనిలో ఆత్మీయమైన మరియు మానసిక ఉద్రేకములకు సంబంధించిన దానిని వేరు చేసి చూడగలిగియుందురో,
- ఎవరైతే విషయాలను భూసంబంధ దృష్టితోకాక పరలోక సంబంధ దృష్టితో చూచుదురో,
- ఎవరైతే దేవుని కొరకు వారు పడిన శ్రమకు వారికి ఇవ్వజూపే ఇహలోక సంబంధమైన బిరుదులన్నిటిని మరియు ఘనతలన్నిటిని తిరస్కరింతురో,
- ఎవరైతే మానక ప్రార్థింతురో మరియు అవసరమైనప్పుడు ఉపవాసముండి ప్రార్థింతురో,
- ఎవరైతే ధారాళముగా, సంతోషముతో, రహస్యముగా మరియు జ్ఞానముతో ఇచ్చుటకు నేర్చుకొందురో,
- ఎవరైతే మనుష్యులందరి కొరకు మరియు వారిలో కొందరినైనా రక్షించుటకు అన్ని విషయములలో వారివలె అగుటకు యిష్టపడుదురో,
- ఎవరైతే ఇతరులు రక్షింపబడవలెనను కోర్కె మాత్రముకాక, వారిని క్రీస్తు యొక్క శిష్యులుగా చేయవలెననియు, దేవుని యొక్క ఆజ్ఞలన్నిటికి విధేయత చూపునట్లు వారిని సత్యము యొక్క గ్రహింపులోనికి తేవలెనని ఆశ కలిగియుందురో,
- ఎవరైతే ప్రతి స్థలములో దేవుని కొరకు స్వచ్ఛమైన సాక్ష్యము స్థిరపర్చబడుట చూచుటకు ఆశకలిగియుందురో,
- ఎవరికైతే సంఘములో క్రీస్తు మహిమ పర్చబడవలెననే ఆశ మండుచుండునో,
- ఎవరైతే ఏ విషయములోనూ తమ స్వంతము గూర్చి వెదకుకొనరో,
- ఎవరైతే ఆత్మీయమైన అధికారము మరియు ఆత్మీయమైన మర్యాద కలిగియుందురో,
- ఎవరైతే అవసరమొచ్చినట్లయితే దేవుని కొరకు లోకములో ఒంటరిగా నిలువబడుదురో,
- ఎవరైతే పాతకాలపు ప్రవక్తలు మరియు అపోస్తులుల వలె ఏ మాత్రము రాజీపడని వారుగా యుందురో అటువంటి వారు కావలసి యున్నది.
అటువంటి వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉండుట చేత ఈనాడు లోకములో దేవుని పని యిబ్బంది పడుచున్నది.
పాపముతోను మరియు అవినీతితోను నిండిపోయిన జనాంగము మధ్యన మరియు రాజీపడుచున్న క్రైస్తవ్యము మద్య అటువంటి దైవజనునిగా యుండుటకు నీ హృదయమంతటితో నిశ్చయించుకొనుము.
దేవునికి పక్షపాతముండదు కావున, నీవు కూడా అటువంటి వానిగా నుండుట సాధ్యమే, అయితే, నీమట్టుకు నీవు అటువంటి వానిగా నుండుటకు ఆసక్తి కలిగియుండవలెను.
దేవుడు ఒకని జీవితములో అతడికి తెలిసినంతవరకే చేయుట కొరకు కాని విధేయతను కాని అడుగుచుండెను. కనుక నీ జీవితములో దైవిక జీవితము గూర్చిన అవగాహన నీకు కొద్దిగా యుండినా, (నీవు దేవుడిచ్చు వెలుగులో నడుస్తూ సంపూర్ణతలోనికి సాగిపోవుచున్నప్పుడు నీలో ఆ అవగాహన పెరుగుచుండును). నీవు అటువంటి వానిగా కావచ్చును.
అటువంటప్పుడు నీవు అటువంటివానిగా నుండకుండుటకు కారణమేమీలేదు.
శరీరములో మంచిది ఏదీ నివసించదు కాబట్టి, పైన చెప్పబడిన లక్షణములు కొరకు మనము దేవుని కృపను కోరుకొనవలసియున్నది.
కాలము సమాప్తమగుచున్న ఈ రోజులలో అటువంటి వానిగా నుండుటకు ప్రతి దినము దేవునికి మొఱ్ఱపెట్టుము, అప్పుడు ఆయన నీకు కృప నిచ్చును. - ఆమెన్
Share this Post Share to Facebook Share to Twitter Email This Pin This

0 comments:

Post a Comment

 
Copyright © 2014. JESUS | Distributed By My Blogger Themes | Designed By OddThemes